Begin typing your search above and press return to search.

ఆర్‌ఎంపీల చికిత్సతో 30 రోజుల్లో 20 మంది మృతి

By:  Tupaki Desk   |   30 May 2023 3:00 PM GMT
ఆర్‌ఎంపీల చికిత్సతో 30 రోజుల్లో 20 మంది మృతి
X
గ్రామాల్లో ఆర్ఎంపీలు వచ్చి రానీ వైద్యంతో సామాన్యుల యొక్క ప్రాణాలను తీస్తున్నారు. గతంలో ఆర్ఎంపీల యొక్క చికిత్స వికటించి మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు ఎంతో మంది ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. సరైన ట్రైనింగ్ లేని ఆర్ఎంపీలు అన్ని జబ్బులకు ఒకే మందు తరహాలో చికిత్స చేయడం వల్ల ఎంతో మంది చిన్న సమస్యలతో కూడా మృతి చెందిన వారు ఉన్నారు.

ఇటీవల అదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో బెంగాల్ డాక్టర్లు వైద్యం అమాయకులైన 20 మంది ప్రాణాలను తీసింది. కేవలం 30 రోజుల్లో ఏకంగా 20 మంది కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

గిరిజనుల్లో ఎక్కువ శాతం మంది కాయ కష్టం చేసుకునే వారు ఉంటారు. వారికి అప్పుడప్పుడు కాలు నొప్పి లేదా మరేదో నొప్పి వస్తూనే ఉంటుంది. ఆ సమయంలో ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లడం ఏదో ఒక మందు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వెంటనే నొప్పి తగ్గించడం కోసం ఆర్‌ఎంపీలు హై డోస్ ప్రమాదకర ఇంజక్షన్స్ ను ఇవ్వడం జరిగిందట.

ఈ మధ్య కాలంలో అలా హైడోస్ ఇంజక్షన్స్‌ తీసుకున్న వారిలో 20 మంది మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన వారు అంతా కూడా నొప్పులతో బాధ పడుతూ ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లిన వారే అంటూ కుటుంబ సభ్యులు మరియు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం జిల్లా ఆరోగ్య అధికారుల దృష్టికి రావడంతో ఎంక్వరీ మొదలు అయ్యిందట.

గడిచిన 30 రోజుల్లో 20 మంది కిడ్నీ సంబంధిత వ్యాదులతో మృతి చెందడంతో పాటు ఇంకా కూడా చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిడ్నీ సంబంధిత సమస్యలతో సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించడానికి... సాధ్యం అయితే ఆపడానికి కూడా ఆరోగ్య అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదట్లో ఆర్‌ఎంపీల యొక్క ఆఘడాల ను గురించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని... ఇప్పుడే చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రశ్నించి ఆర్‌ఎంపీల యొక్క వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

దాంతో బెంగాల్‌ ఆర్‌ఎంపీలు సర్దేసుకుని పారిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆర్‌ఎంపీల యొక్క హై డోస్ చికిత్స ప్రాణాలకు ప్రమాదం అయిన వెళ్లడి అవ్వడంతో గ్రామాల్లో ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.