Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కి అదిరిపోయే రేటింగ్ !

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:37 PM GMT
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కి అదిరిపోయే రేటింగ్ !
X
ఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 . అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా , ఉండదా అనుకున్న నేపథ్యంలో ఎట్టకేలకి యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 న ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే మూడు మ్యాచులు కూడా జరిగాయి. ఒక్క ఇండియా లో ఐపీఎల్ జరగలేదు అన్న భాద తప్ప , మిలిగింది మొత్తం అలానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ను కోట్లాది మంది వీక్షిస్తుంటారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ టీవీ వీక్షణల పరంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.

అబుదాబి వేదికగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 20 కోట్ల మంది చూశారు. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా, ఏ క్రీడలో అయినా, ఏ దేశంలో అయినా టీవీ, డిజిటల్ వ్యూస్ పరంగా ఇది రికార్డు అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూఏఈలో నిర్వహిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించకపోవడం తెలిసిందే. దాంతో ఓపెనింగ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు, ఐప్యాడ్లు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయిన విషయం వ్యూయర్ షిప్ లెక్కలతో అర్థమవుతోంది. అలాగే టీమిండియా దిగ్గజం, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో కనిపించింది ఈ మ్యాచ్ తోనే. దాంతో చెన్నై, ముంబయి మ్యాచ్ కు వ్యూస్ వెల్లువెత్తాయని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.