Begin typing your search above and press return to search.

టీచర్ పై పోలీసుల గ్యాంగ్ రేప్

By:  Tupaki Desk   |   16 Feb 2020 5:38 PM IST
టీచర్ పై పోలీసుల గ్యాంగ్ రేప్
X
సమాజాన్ని కాపాడాల్సిన వారే దారితప్పారు. రాత్రి ఒంటరిగా వస్తున్న యువతిని లాక్కెళ్లి రేప్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే కాటేస్తే ఎలా ఉంటుందో తెలిపే దారుణ ఘటన ఇదీ.. ఒంటరిగా వెళ్తున్న మహిళకు సహాయ సహకారాలు అందించాల్సింది పోయి ఆమెపైనే అత్యాచారం చేసిన పోలీసుల దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ జిల్లాలోని గోరఖ్ నాథ్ ప్రాంతంలో 24 ఏళ్ల వయసున్న యవతి ట్యూషన్ టీచర్ గా పనిచేస్తోంది. అక్క ఇంటికి వెళ్లిన యువతి ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. అటుగా వెళ్తున్న ఇద్దరు పోలీసులు సదురు యువతిపై కన్నేశారు. ఆమెను అడ్డుకొని నువ్వు వేశ్యవు అంటూ మానసికంగా ఇబ్బంది పెట్టారు. తాను టీచర్ అని చెప్పినా వినలేదు. బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలోని గదికి లాక్కెళ్లారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా దారుణంగా కొట్టారు. గాయపర్చారు. బాధితురాలి చేతిలో రూ.600 పెట్టి వెళ్లిపోమ్మన్నారు. ఇంటికి చేరిన ఆమె ఈ ఘటనపై తల్లిదండ్రులకు చెప్పి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.