Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్ల ప్రభావం.. రెండు టీవీలపై నిషేధం

By:  Tupaki Desk   |   7 March 2020 7:20 AM GMT
ఢిల్లీ అల్లర్ల ప్రభావం.. రెండు టీవీలపై నిషేధం
X
దేశంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు చెలరేగినప్పుడు మీడియా సమన్వయం పాటించాలి. స్వీయ నియంత్రణ అనే సూత్రం పాటించకుండా ఇష్టపూర్వకంగా వార్తలు తెలిపితే ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంది. తాజాగా ఇలాంటి పరిస్థితులనే కొన్ని టీవీ చానల్స్ కొన్ని విలువలను విస్మరించి ఢిల్లీ అల్లర్లపై వార్తలు ప్రసారం చేయడం తో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ టీవీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజుల పాటు ఆ టీవీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినం రెండు మలయాళ ఛానళ్లపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది.

ఆయా ఛానళ్లపై 48 గంటల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై చేసిన రిపోర్టింగ్ రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా మళయాలం చానల్స్ ఏసియన్ నెట్, మీడియా వన్ ప్రసారాలు చేశాయని కేంద్రం ప్రభుత్వం గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఆ చానల్స్ శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ చానళ్లపై నిషేధం విధించాడన్ని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

ఛానళ్లపై నిషేధం విధించడం, విధించకపోవడం, సెన్సార్‌షిప్ వంటివి మంత్రిత్వ శాఖ, బ్యూరోక్రాట్లు చేయడం సరికాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. యూకే‌లోని ఆఫ్‌కామ్ మాదిరిగా ఓ స్వతంత్ర సంస్థ వీటిపై నిర్ణయం తీసుకోవడం సరైనదని తెలిపారు. ఈ నిషేధంపై జర్నలిస్టు ప్రముఖులు కూడా తప్పు బడుతున్నారు.