Begin typing your search above and press return to search.
మాస్క్ పెట్టుకోనందుకు రూ.42లక్షలు ఫైన్
By: Tupaki Desk | 20 May 2020 6:00 AM ISTవిన్నంతనే ఉలిక్కి పడటమే కాదు.. ఎంతకు నమ్మని షాకింగ్ వైనం ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో శానిటైజర్లు వాడటం.. ముఖానికి మాస్కులు పెట్టుకోవటం చేసిన తప్పునకు భారీగా మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ముఖానికి మాస్కు లేకుండా బయటకు వస్తే మన దగ్గర రూ.వెయ్యి ఫైన్ వేయాలని డిసైడ్ అయ్యారు. అయినప్పటికీ.. చాలామంది మాస్కు లేకుండానే బయటకు వస్తున్న దుస్థితి.
అయితే.. ఖతార్ లో మాత్రం ముఖానికి మాస్కు లేకుండా వచ్చే వారికి అక్కడి అధికారులు వేస్తున్న ఫైన్లను చెల్లించాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా ముఖానికి మాస్కు లేకుండా బయటకు వస్తే.. 2 లక్షల రియాల్స్ ఫైన్ గా డిసైడ్ చేశారు. భారత రూపాయితో పోల్చినప్పుడు ఒక రియాల్ దగ్గర దగ్గర రూ.20కు కాస్త ఎక్కువ.
ఈ లెక్కన 2 లక్షల రియాల్స్ అంటే.. మన రూపాయిల్లో రూ.42 లక్షలతో సమానం. ఇంత భారీగా ఫైన్ వేసిన తర్వాత కూడా వదలరట. మూడేళ్ల జైలుశిక్షకూడా విధిస్తారట. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. 28 లక్షల మంది జనాభా ఉన్న ఆ చిన్నదేశంలో ఇప్పటివరకూ 28 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మరింత కఠినంగా నిబంధనల్ని తయారు చేసి అమలు చేస్తున్నారు. ఏమైనా మాస్కు ధరించకుంటే ఇంత భారీ జరిమానా మాత్రం మామూలు విషయం కాదని చెప్పక తప్పదు.