Begin typing your search above and press return to search.

సారాయి కంటే శానిటైజర్ ధర తక్కువనా.. అందుకే కడపలో తాగారా?

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:36 AM GMT
సారాయి కంటే శానిటైజర్ ధర తక్కువనా.. అందుకే కడపలో తాగారా?
X
ఏపీ సర్కార్ మద్యపాన నిషేధం దిశగా ధరలను భారీగా పెంచేసింది. రోజంతా కూలీ చేసి వచ్చిన సొమ్ము అంతా మద్యానికే పోతున్న పరిస్థితి. తెలంగాణలో లాగా చీప్ లిక్కర్ ను 50 రూపాయాలకు లభించేలా చేస్తే పేదలు ఈ మద్యం తాగి గమ్మున పడుకుంటారు. పని చేసుకుంటారు.. వారి సంపాదన సేవ్ అవుతుంది. కానీ ఏపీలో నిషేధం అంటూ ధరలను 200 నుంచి రూ.300 దాటించడంతో పేదలు అంత పెట్టి మద్యం కొనలేక పక్కదారి పడుతున్నారు. ఇక సారాయి కూడా ఏపీలో దొరకకా డిమాండ్ ఏర్పడింది. దానికి ధర వందల్లోనే ఉంది.

ఈ క్రమంలోనే మార్కెట్లో రూ.20 నుంచి రూ.30 రూపాయలకు దొరికే అదే అల్కహాల్ బేసిడ్ శానిటైజర్లను పేదలు కొనుక్కొని మద్యంగా ప్రయోగాలు చేసి తాజాగా కడప జిల్లాలో తాగారు. కరోనా వైరస్ ను, క్రిములను చంపేసే శానిటైజర్లో అల్కహాల్ ఉంటుంది. అది వైరస్ లనే కాదు.. తాగితే మనుషులను చంపేస్తుంది. అదే మందు అనుకొని తాగిన పేదలను శానిటైజర్ చంపేసింది. ఇటీవలే కడపలో కిక్కు కోసం తాగిన పేదలు అసువులు బాసారు.

దీన్ని బట్టి తెలిసిందేంటంటే.. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా సాగడం మంచిదే కాదనలేరు. కానీ పేదల కోసం కనీసం 100 రూపాయల లోపు ఏదైన చీప్ మద్యం తెస్తే వారి మానాన వారు తాగి ఊరుకుంటారు. లేదంటే ఈ ధరాఘాతంతో శానిటైజర్లు తాగుతూ ప్రయోగాలు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పటికైనా ఏపీలో మద్యం ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మందుబాబులు కూడా మద్యం కిక్కు కోసం ఇలా ఏది పడితే అది తాగి ప్రాణాలు తీసుకోవద్దని హితవు పలుకుతున్నారు.