Begin typing your search above and press return to search.

'సైబర్ నో' చెప్పిన షాకింగ్ నిజం.. భారత్ ను దెబ్బేసేందుకు 190 గ్రూపులు రెఢీ

By:  Tupaki Desk   |   2 Jun 2023 3:00 PM GMT
సైబర్ నో చెప్పిన షాకింగ్ నిజం.. భారత్ ను దెబ్బేసేందుకు 190 గ్రూపులు రెఢీ
X
కాలం మారింది. ఇప్పుడు యుద్ధం చేసే తీరుతెన్నులు మారిపోయాయి. యుద్ధం అంటే.. తలలు తెగటం.. రక్తం కారటం.. ఆస్తుల విధ్వంసం.. ఇవి మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కంటికి కనిపించకుండా జరిగే దాడి తో కళ్లు తెరిచి చూసే సరికి వ్యవస్థల్ని కుప్పకూలేలా చేయటం.. భారీ గా ఆర్థిక నష్టం వాటిల్లేలా చేసేయటం లాంటివెన్నో. నిజానికి ఈ దాడుల కు పాల్పడే వారికి.. దాడికి గురయ్యే లక్ష్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏమీ లేకపోవచ్చు. చిన్న చిన్న కారణాలు కూడా.. భారీ సైబర్ దాడుల కు కారణంగా మారుతుంటాయి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా అంతర్జాతీయ సంస్థ సైబర్ నో సంస్థ ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది.

ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరుగుతున్న యుద్దం నేపథ్యంలో అనేక సైబర్ నేరగాళ్ల గ్రూపులు యాక్టివ్ గా మారటం.. తాము మద్దతు ఇస్తున్న దేశం తరఫున పోరు చేయటం.. తమ ప్రత్యర్థికి మద్దతు ఇచ్చే దేశాల్ని టార్గెట్ చేసి.. వారి సైబర్ వ్యవస్థల మీద దాడికి దిగి.. వారిని తీవ్రంగా నష్టపోయేలా చేయటం లాంటివి చేస్తున్నారు. సదరు సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు190 గ్రూపులు ప్రపంచ దేశాల కు వార్నింగ్ ఇచ్చాయి. వీటిలో 160 గ్రూపులు భారత్ మీద గురి పెట్టినట్లుగా సైబర్ నో సంస్థ వెల్లడించింది. ఈ యుద్ధంలో భారత్ ఏ దేశానికి మద్దతు ఇస్తే.. రెండో దేశానికి మద్దతు ఇచ్చే గ్రూపు దాడి చేయాలన్నది ఆలోచన. అయితే.. ఈ వ్యవహారంలో భారత్ తటస్థంగా ఉండటం తెలిసిందే.

దీంతో.. హ్యక్టివిస్ట్ లు కామ్ గా ఉండిపోయారని చెబుతున్నారు. ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న పోరులో మొత్తం 160 హ్యాక్టివిస్ట్ గ్రూపుల్లో 80 రష్యాకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. తమ ఉనికిని చాటేందుకు రంగంలోకి దిగే సైబర్ నేరగాళ్లు.. భారీ ఎత్తున దాడుల కు దిగుతున్నారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా అనానిమస్ సూడాన్.. హ్యాక్టివిస్ట్ రష్యా.. డ్రాగన్ ఫోర్స్ మలేసియా.. ఇలా చెప్పుకుంటే బోలెడన్ని గ్రూపులు ఉన్నట్లుగా చెప్పాలి. వీటి టార్గెట్ భారత్ మాత్రమే కాదు.. అనేక డెవలపింగ్ కంట్రీలుగా చెబుతారు.

బీజేపీ ఎంపీ సుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హ్యాక్టివిస్టులు ఒక్కసారిగా సైబర్ దండయాత్ర ను మన దేశం మీద చెసినట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వెబ్ సైట్ల ను టార్గెట్ చేసి.. ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయం కోసం ఇంటర్ పోల్ ను అడగాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. అప్పట్లోభారత్ కు వ్యతిరేకంగా డ్రాగన్ ఫోర్స్ మలేషియా.. హ్యాక్టివిస్టు ఇండోనేషియా అనే రెండు హ్యాకర్ గ్రూపులు రంగం లోకి దిగాయి.

సుపూర్ వ్యాఖ్యల కు నిరసనగా ఈ దాడిలో పాల్గొనాలని ఈ రెండు గ్రూపుల నిర్వాహకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక వర్గం హ్యాకర్లను కోరటంతో దాదాపు 2 వేల వెబ్ సైట్ల పై ఈ రెండు గ్రూపులు టార్గెట్ చేయటమే కాదు.. ఇతరులు సైతం దాడుల కు దిగేలా పురిగొల్పటం గమనార్హం.అందుకు అవసరమైన సమాచారాన్ని డార్క్ వెబ్ ద్వారా అందించినట్లుగాచెబుతున్నారు. మరికొందరు సోషల్ మీడియా సాయాన్ని తీసుకొని.. సమాచారాన్నిషేర్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే సైబర్ సెక్యూరిటీ కి ఇచ్చే ప్రాధాన్యం.. బడ్జెట్ పెరగాల్సి ఉంది. పటిష్టమైన ఫైర్ వాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీరంతా ప్రధానంగా డిసస్టట్రి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ఆఫ్ సర్వీసెస్ విధానంలో దాడికి పాల్పడుతున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ సాయంతో కొన్ని లక్షల హిట్స్ తాము టార్గెట్ చేసుకున్న వెబ్ సైట్ కు వచ్చేలా చేసి.. విపరీతమైన ఒత్తిడి ని సైట్ మీద పెట్టి.. దాన్ని తట్టుకోలేక సర్వర్ కుప్పకూలేలా చేస్తారని చెబుతున్నారు. సో.. యుద్ధం చేసే లెక్కలు మారాయి. అందుకు తగ్గట్లు మనం కూడా మరింత వేగంగా మారాల్సిన పరిస్థితులు వచ్చేసినట్లే.