Begin typing your search above and press return to search.
32ఏళ్ల యువతిపై 19ఏళ్ల యువకుడు అఘాయిత్యం !
By: Tupaki Desk | 4 Sept 2020 1:40 PM ISTపెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్ల యువతిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి 32ఏళ్ల యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు 19 ఏళ్ల యువకుడు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువతిపై కన్నేశాడు.
ఆమె వెంటపడి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. పెళ్లి చేసుకొని హాయిగా జీవిద్దాం అంటూ ఏమార్చాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమ్మని యువతి ఒత్తిడి తేవడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గురువారం రిమాండ్ కు తరలించారు.