Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేసీఆర్ వచ్చేశాడు

By:  Tupaki Desk   |   26 Jan 2021 4:30 PM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేసీఆర్ వచ్చేశాడు
X
తనకు నచ్చితే నెత్తిన పెట్టుకోవడం నచ్చకపోతే అస్సలు అడుగుపెట్టకపోవడం సీఎం కేసీఆర్ నైజం. ఎవ్వరు చెప్పినా వినకుండా కేసీఆర్ ముందుకెళుతారు. వాస్తు బాగా లేదని.. తెలంగాణ ఏర్పడ్డాక అసలు సచివాలయం ముఖం కూడా చూడని సీఎం ఎవ్వరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే.

అందుకే రెండోసారి గద్దెనెక్కగానే సచివాలయం కూల్చి కొత్త సచివాలయం పనులను శరవేగంగా ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం పరిశీలించారు. దాదాపు 19 నెలల తర్వాత కేసీఆర్ సచివాలయ ప్రాంగణానికి రావడం విశేషం.సచివాలయ నిర్మాణంలో వేగం పెంచాలని.. అత్యంత నాణ్యతతో చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రధాన గేట్, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను .. భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కేసీఆర్ పరిశీలించారు.

2019 జూన్ చివరి వారంలో సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం కొత్త భవంతులకు శంకుస్థాపన చేసి మళ్లీ 19 నెలల తర్వాత ఈరోజు సచివాలయ నిర్మాణ ప్రాంతానికి రావడం విశేషంగా చెప్పొచ్చు.కొత్త సచివాలయం పనులను ముంబైకి చెందిన షాపూరస్ జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకుంది. దాదాపు 617 కోట్లతో నూతన సచివాలయాన్ని తెలంగాణ సర్కార్ నిర్మిస్తోంది.