Begin typing your search above and press return to search.

అద్భుతం.. 18వేల ఏళ్లనాటి జంతువిదీ..

By:  Tupaki Desk   |   1 Dec 2019 7:00 AM IST
అద్భుతం.. 18వేల ఏళ్లనాటి జంతువిదీ..
X
రష్యా దేశంలోని సైబీరియా ఒక ఏడారి ప్రాంతం.. ఏడారి అంటే ఇసుక తిన్నెలు ఉండే ఏడారి కాదండోయ్. అది మంచుతో పూర్తిగా కప్పబడిన మంచు ఏడారి ప్రాంతం. అక్కడ కొన్ని వేల ఏళ్ల క్రితం మరణించిన జంతువులు కూడా మంచు వల్ల పాడైపోకుండా చెక్కుచెదరకుండా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఎన్నో దొరికాయి..

తాజాగా ఆ కోవలోనే సైబీరియా ఎడారిలో అద్భుతం జరిగింది. ఏకంగా 18వేల ఏళ్ల క్రితం చనిపోయినట్టుగా భావిస్తున్న ఓ కుక్క పిల్ల మృతదేహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మంచులో కూరుకుపోయిన ఈ కుక్కపిల్ల మృతదేహం చెక్కు చెదరలేదు. దాని శరీరం, మందమైన జుట్టు, మూతీ, మీసాలు వెంట్రుకలు మంచులో ఉండడం వల్ల చెడిపోలేదు. ఇప్పుడే చనిపోయిన అడవి కుక్కగా ఎంతో బలిష్టంగా ఉంది.

రెండు నెలల వయసున్న ఈ కుక్క ఎలా చనిపోయిందో కారణాలను శాస్త్రవేత్తలు కనిపెట్టలేదు. దీని జన్యువును పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ కుక్క పిల్ల 18వేల ఏళ్ల క్రితం నాటిదిగా ప్రకటించారు. భూమ్మీద అన్ని వేలనాటి కుక్క దొరకడం చూసి శాస్త్రవేత్తలు అబ్బురపడుతున్నారు.

అయితే ఇది కుక్కపిల్లానా లేక తోడేలా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని పరిశోధన చేసిన స్వీడన్ శాస్త్రవేత్తలు తెలిపారు.