Begin typing your search above and press return to search.

18 మంది త‌మ్ముళ్లు ట‌చ్ లో ఉన్నారు..బాబుకు జైలే!

By:  Tupaki Desk   |   4 July 2019 2:42 PM IST
18 మంది త‌మ్ముళ్లు ట‌చ్ లో ఉన్నారు..బాబుకు జైలే!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మంటూ త‌ర‌చూ వ్యాఖ్య‌లు చేసే బీజేపీ జాతీయ‌కార్య‌ద‌ర్శి క‌మ్ ఏపీ కో ఇంఛార్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సునీల్ దియోధ‌ర్ తాజాగా మ‌రోసారి అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఈసారి బాబు జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మ‌న్న మాట‌తో పాటు.. మ‌రో సంచ‌ల‌న అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు.

టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది త‌మ‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. చంద్ర‌బాబు.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు.. ఆయ‌న‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారంతా అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. ఈ కార‌ణంతోనే టీడీపీ ప్ర‌తిష్ఠ దిగ‌జారిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ విష‌యాలు తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు.

ఏపీలో బ‌లం పెంచుకునే దిశ‌గా బీజేపీ ప్ర‌య‌త్నాలు షురూ చేసింద‌ని.. చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల కార‌ణంగా ఏపీలో టీడీపీకి ఫ్యూచ‌ర్ లేకుండా పోయింద‌న్నారు. ఒక్కో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ల‌క్ష మంది కార్య‌క‌ర్త‌ల్ని పార్టీలో చేర్చ‌నున్న‌ట్లు చెప్పారు. ఆ ల‌క్ష్యం దిశ‌గా తాము ప‌య‌నిస్తున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌నున్నార‌ని.. ఆయ‌న చేసిన త‌ప్పుల‌కు క‌చ్ఛితంగా మూల్యం చెల్లిస్తార‌న్నారు. బాబును.. టీడీపీని బీజేపీ టార్గెట్ చేసింద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆయ‌న మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.