Begin typing your search above and press return to search.

18 మందికి అత్యున్న‌త పద్మ పుర‌స్కారాలు!

By:  Tupaki Desk   |   26 Jan 2019 5:35 AM GMT
18 మందికి అత్యున్న‌త పద్మ పుర‌స్కారాలు!
X
ప్ర‌తి ఏడాది మాదిరే ఈసారి కూడా రిప‌బ్లిక్ డేకు ఒక రోజు ముందు దేశ అత్యున్న‌త పుర‌స్కార‌మైన భార‌త ర‌త్న‌తోపాటు.. ప‌ద్మ పుర‌స్కారాలు పొందిన ప్ర‌ముఖుల జాబితాను విడుద‌ల చేయ‌టం తెలిసిందే. దేశంలో అత్యున్న‌త పుర‌స్కారం భార‌త‌ర‌త్న కాగా.. దాని త‌ర్వాతి పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్ గా చెప్పాలి. ఆ త‌ర్వాతి స్థానం ప‌ద్మ‌భూష‌ణ్ కు ద‌క్కుతుంది. నాలుగో స్థానంలో ప‌ద్మ‌శ్రీ‌కు ద‌క్కుతుంది.

ఈసారి ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం న‌లుగురిని వ‌రించింది. ఈ న‌లుగురిలో ముగ్గురు భార‌తీయులు కాగా.. మ‌రొక‌రు విదేయులు. దేశీంగా ముగ్గురిని ఎంపిక చేయ‌గా.. వారిలో ఇద్ద‌రు మ‌హారాష్ట్రకు చెందిన వారు కాగా.. మ‌రొక‌రు ఛ‌త్తీస్ గ‌ఢ్ కు చెందిన వారు. ఇక‌.. ప‌ద్మ‌భూష‌న్ విష‌యానికి వ‌స్తే మొత్తం 14 మందిని ప్ర‌క‌టించారు. వీరిలో ఇద్ద‌రు విదేశీయులు కాగా.. మిగిలిన 12 మంది భార‌తీయులే. వీరిలో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా.. మ‌హారాష్ట్రకు చెందిన వారు ఇద్ద‌రు.. కేర‌ళ రాష్ట్రానికి చెందిన వారు ఇద్ద‌రు. ఇక‌.. పంజాబ్‌.. హ‌ర్యానా.. జార్ఖండ్‌.. ప‌శ్చిమ‌బెంగాల్‌.. ఉత్త‌రాఖండ్‌.. బిహార్‌కు చెందిన ఒక్కొక్క‌రికి పుర‌స్కారం ల‌భించింది.

ప‌ద్మ‌విభూష‌ణ్.. ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాలు ల‌భించిన 18 మందిలో విదేశీయులు ముగ్గురు కాగా.. ద‌క్షిణాదికి చెందిన వారు ఇద్ద‌రే కావ‌టం గ‌మ‌నార్హం. అత్య‌ధిక పుర‌స్కారాలు ఢిల్లీ.. మ‌హారాష్ట్రల వారికి ద‌క్క‌టం విశేషం. ఇక‌.. దేశంలో అతి పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌ద్మ‌విభూష‌ణ్ కానీ ప‌ద్మ భూష‌ణ్ కు సంబంధించిన పుర‌స్కారాల్లో చోటు ద‌క్క‌లేదని చెప్ప‌క త‌ప్ప‌దు.
ఇక‌.. ప‌ద్మ విభూష‌ణ్.. ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాలు పొందిన ప్ర‌ముఖులు.. వారి రాష్ట్రాల‌తో పాటు.. వారు ఏ రంగానికి చెందిన వారు అన్న విష‌యాన్ని చూస్తే...

ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కార గ్ర‌హీత‌లు..
పేరు రాష్ట్రం రంగం

తీజ‌ర్ బాయి ఛ‌త్తీస్ గ‌ఢ్ క‌ళ‌లు

ఇస్మాయిల్ ఒమ‌ర్ జ‌బౌట్ (విదేశీయుడు) ప్ర‌జా సంబంధాలు

అనిల్ కుమార్ మ‌ణిభాయ్ నాయ‌క్ మ‌హారాష్ట్ర వ‌ర్త‌కం.. ప‌రిశ్ర‌మ‌లు

బ‌ల్వంత్ మోరేశ్వ‌ర్ పురంద‌రే మ‌హారాష్ట్ర క‌ళ‌లు.. న‌ట‌న‌.. థియేట‌ర్

ప‌ద్మ‌భూష‌ణ్
పేరు రాష్ట్రం రంగం

జాన్ చాంబ‌ర్స్(విదేశీయుడు) యూఏఎస్ ఏ వ‌ర్త‌కం.. వాణిజ్యం.. టెక్నాల‌జీ

సుఖ్ దేవ్ సింగ్ ధిండ్వా పంజాబ్ ప్ర‌జా సంబంధాలు

ప్ర‌వీణ్ గోర్థాన్ (విదేశీయుడు) ద‌క్షిణాఫ్రికా ప్ర‌జా సంబంధాలు

మ‌హాశ‌య్ ధ‌ర‌మ్ పాల్ గులాటీ ఢిల్లీ వ‌ర్త‌కం.. ప‌రిశ్ర‌మ‌లు

ద‌ర్శ‌న్ లాల్ జైన్ హ‌ర్యానా సామాజిక సేవ‌

అశోక్ ల‌క్ష్మ‌ణ్ రావు కుక‌డే మ‌హారాష్ట్ర వైద్యం.. ఆరోగ్యం

క‌రియా ముండా జార్ఖండ్ ప్ర‌జాసంబంధాలు

బుధాదిత్య ముఖ‌ర్జీ ప‌శ్చిమ‌బెంగాల్ క‌ళ‌లు.. సంగీతం.. సితార్

మోహ‌న్ లాల్ కేర‌ళ సినిమా.. క‌ళ‌లు

నంబి నారాయ‌ణ్ కేర‌ళ అంత‌రిక్షం

కుల‌దీప్ న‌య్య‌ర్(మ‌ర‌ణానంత‌రం) ఢిల్లీ సాహిత్యం.. జ‌ర్న‌లిజం

బ‌చేంద్రిపాల్ ఉత్త‌రాఖండ్ క్రీడ‌లు.. ప‌ర్వ‌తారోహ‌ణ‌

వీకే మంగ్లు ఢిల్లీ సివిల్ స‌ర్వీస్‌

హుకుందేవ్ నారాయ‌ణ్ యాద‌వ్ బిహార్ ప్ర‌జాసంబంధాలు