Begin typing your search above and press return to search.

అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లింపు లెక్కేంటి? చట్టం ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   12 Aug 2022 11:34 AM GMT
అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లింపు లెక్కేంటి? చట్టం ఏం చెబుతోంది?
X
ఒకే దేశం ఒకే పన్ను పేరుతో మహా గొప్పగా చెప్పిన మోడీ సర్కారు.. జీఎస్టీ వచ్చిన తర్వాత మరింత బాదుడు పెరగటమే కానీ తగ్గింది లేదు. నిజానికి పన్ను ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నా.. ప్రజల మీద భారం తగ్గించే విషయంలో మాత్రం మోడీ సర్కారు పెద్దగా ఫోకస్ చేయని పరిస్థితి ఉందన్న మాట తరచూ వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో పాలు.. పెరుగు.. నిత్యవసర వస్తువులు ప్యాకింగ్ తో ఉంటే వాటికి జీఎస్టీ చెల్లించాలంటూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై పెను దుమారం రేగినప్పటికి.. ప్రజలు శాంతించే రీతిలో మోడీ సర్కారు రియాక్టు కాలేదన్నది నిజం.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో అంశంపై కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. ఇంతకూ ఆ విషయం ఏమంటే.. అద్దెకు ఉంటున్న వారు తాము చెల్లించే అద్దెపై 18 వాతం జీఎస్టీ చెల్లించాలన్న నిర్ణయాన్ని జూన్ లో జరిగిన జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని జులై 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ అద్దెకు ఉండేవారు జీఎస్టీ చెల్లించాలా? చట్టం ఏం చెబుతోంది? అన్న విషయంలోకి వెళితే..

అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. చాలా స్పష్టంగా మెదడులోకి సేవ్ చేసుుకోవాల్సిన అంశం ఏమంటే.. ‘అద్దెకు ఉండే ప్రతి ఒక్కరూ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని. మరి.. ఎవరు చెల్లించాలంటే జీఎస్టీలో తమకు వచ్చే అద్దెను నమోదు చేసుకున్న అద్దెదారులు మాత్రమే పన్ను చెల్లించాలి. అయితే.. అలా చెల్లించిన పన్నుకు జీఎస్టీ రిటర్నులో ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద మినహాయింపు పొందే వీలుంది. ఉద్యోగులు సైతం అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు.

యజమాని జీఎస్టీలో నమోదై ఉండి.. అద్దెదారు కూడా జీఎస్టీలో నమోదై (రిజిస్టర్) ఉంటే.. అద్దెకు ఉంటున్న వారు జీఎస్టీ చెల్లించాలి. ఆ తర్వాత ఇన్ ఫుట్ సబ్సిడీ ద్వారా ఆ మొత్తాన్ని తిరిగి పొందే వీలుంది. ఇక్కడో మరో అంశం ఏమంటే.. అద్దెకు ఇచ్చిన యజమాని.. అద్దెకు తీసుకున్న అద్దెదారు ఇద్దరు జీఎస్టీలో నమోదు చేయించుకొని ఉండకపోతే.. వారు ఆ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికిరిజిస్ట్రేషన్ లేకున్నా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు.

మరి.. పన్ను చెల్లించాల్సిన వారు ఎవరు? అన్న ప్రశ్నకు చట్టం చెప్పేదేమంటే.. స్థూలంగా రూ.20లక్షలు.. అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు.. ఏటా రూ.40 లక్షలు టర్నోవర్ చేసే వ్యాపారులు.. వారు చెల్లించే అద్దెపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన వారు ఎవరూ కూడా అద్దె మీద జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా యజమాని తాము జీఎస్టీ చెల్లిస్తున్నామని.. తమకు అద్దెతో పాటు చెల్లించాలని చెబితే.. అనవసరంగా ఆగం కాకుండా రూల్ పొజిషన్ చూపిస్తే సరిపోతుంది.