ఏటా రూ.14 కోట్లు ఫ్రీగా ఇస్తామంటే.. వద్దని చెప్పిన యువతి!

Thu Jun 17 2021 06:00:01 GMT+0530 (IST)

17 yr old Dutch Princess rejects ?14cr annual allowance

ఫ్రీగా 14 కోట్ల రూపాయలు ఇస్తామంటే.. మనలో ఎంత మంది వద్దని చెబుతారు? ఒకసారి కాదు.. ఈ విధంగా ప్రతీ సంవత్సరం వచ్చిపడతాయంటే కాదనేవారు ఎంత మంది? ఆ యువతి మాత్రం తనకు అవసరం లేదని చెప్పింది. ఆ డబ్బు తాను తీసుకోనని తేల్చి చెప్పింది. మరి ఆ యువతి ఎవరు? ఆమెకు అంత డబ్బు ఎవరిస్తారు? ఆమె ఎందుకు వద్దన్నది అనే వివరాలు చూద్దాం..ఆమె పేరు అమాలియా. ఈమె సాధారణ మహిళ కాదు. నెదర్లాండ్ యువరాణి. 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆమె మేజర్ అవుతుంది. మేజర్ అయిన తర్వాత ఆమెకు వ్యక్తిగత అవసరాల కోసం ప్రతీ సంవత్సరం 1.9 మిలియన్ల నెదర్లాండ్ డాలర్స్ అందిస్తుంది ప్రభుత్వం. మన కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.14 కోట్లు. డిసెంబర్ 7న ఆమె బర్త్ డే. ఈ ఏడాది డిసెంబర్ 7తో ఆమెకు 18ఏళ్లు వస్తాయి.

ఇక అప్పటి నుంచి జీవితాంతం ఆమెకు ఏటా రూ.14 కోట్లు అందుతాయి. అయితే.. ఈ డబ్బు తనకు అవసరం లేదని చెప్పింది ప్రిన్సెస్ అమాలియా. పుణ్యానికి వచ్చే డబ్బు తాను తీసుకోలేనని ఎలాంటి కష్టమూ పడకుండా వచ్చే డబ్బు తను వాడుకోలేనని సంచలన ప్రకటన చేసింది.

‘‘ఈ ఏడాది డిసెంబరు 7న నాకు 18 ఏళ్లు వస్తాయి. చట్ట ప్రకారం అందే ఈ అలవెన్సు నాకు ఇష్టం లేదు. నేను ఏమీ చేయకుండా ఆ డబ్బును తీసుకోవడం నాకు ఇష్టం లేదు.’’ అని ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది.