Begin typing your search above and press return to search.
16కిలోల టమోటా రూ.20
By: Tupaki Desk | 22 Aug 2015 6:20 AM ISTమీరు కూరగాయలు కొంటున్నారా? కిలో టమోటాలు ఎంత పలుకుతున్నాయి? కిలోకు రూ.20కు తక్కువ కాకుండా రూ.30 మించకుండా దొరుకుతున్న పరిస్థితి. సామాన్యుడు మార్కెట్ లోకి వెళితే.. ఇంత ధర పలుకుతున్న టమటా.. దాన్ని పండించిన రైతుకు దక్కుతున్నదెంతో తెలుసా.. 16 కిలోలకు రూ.20. నమ్మలేకున్నా ఇది నిజం. అంతే కిలో టమోటా రూపాయి పావలా పలుకుతున్నదన్న మాట.
హెల్ సేల్ మార్కెట్ లో కిలో రూపాయి పావలాకు కొంటున్న టమోటాలు.. సామాన్యుడి దగ్గరకు చేరుకునే సరికి కాస్త అటూఇటూగా కిలో రూ.20 పలుకుతున్న పరిస్థితి. నిజానికి శుక్రవారం వరకూ 16కిలోల బాక్సు ధర వంద రూపాయిల నుంచి రూ.120 పలుకుతోంది. అయితే.. మార్కెట్ లోకి సరుకు ఎక్కువ రావటంతో అనంతపురం మార్కెట్ లోని హోల్ సేల్ వ్యాపారులు దారుణంగా ధరను పడేశారు. దీంతో.. టమోటాను పండించిన రైతులు లబోదిబో అంటున్నారు.
లాభాలు అక్కర్లేదని.. తాము పండించినపంటకు కనీస గిట్టుబాటు ధర చెల్లిస్తే అదే పదివేలని రైతులు వాపోతున్నారు. స్వేదం చిందించి.. కష్టనష్టాలకు ఓర్చి పంటను పండించిన రైతుకు లాభం తర్వాత కనీస గిట్టుబాటు ధర కూడా లభించటం లేదంటే మార్కెట్ లో వ్యాపారుల మాయాజాలం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. కష్టపడిన వ్యక్తికి కనీస ఫలితం కూడా అందకపోవటం అంటే.. ఇది రాష్ట్ర సర్కారు వైఫల్యంగా చెప్పక తప్పదు. ఇలాంటి ఆరాచకాల మీద మార్కెటింగ్ శాఖ.. మంత్రుల పేషీ ఏం చేస్తున్నట్లు..?