Begin typing your search above and press return to search.

కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ !

By:  Tupaki Desk   |   14 July 2020 1:15 PM IST
కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ  గ్రీన్ సిగ్నల్ !
X
బిటెక్ లో ఈ ఏడాది నుండి మరో రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. మర్కెట్స్ లో ఉన్న డిమాండ్స్ ను బట్టి ఆ కోర్సులని చదవడానికి ఎక్కువమంది ఉత్సహం చూపిస్తుండటంతో ఆ కోర్సుల ఏర్పాటుకి ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు- మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ నెట్‌వర్క్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దీనితో రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటితోపాటు కంప్యూటర్‌ సైన్స్‌లో 23,040 సీట్లు, ఈసీఈలో 18,495 సీట్లకు, ఈఈఈలో 8,430 సీట్లు, ఇతర కోర్సుల్లో మిగతా సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు అందులో ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తాయో చూడాలి.