Begin typing your search above and press return to search.

వజ్రాల వ్యాపారి కన్యాదానాల ఐడియా అదిరింది

By:  Tupaki Desk   |   7 Dec 2015 9:31 AM IST
వజ్రాల వ్యాపారి కన్యాదానాల ఐడియా అదిరింది
X
ఓపక్క ఇబ్బడిముబ్బడిగా సంపాదించటమే కాదు.. వాటిని ఖర్చు చేసే విషయంలోనూ ఈ మధ్య మానవత్వం ప్రదర్శిస్తున్నారు. తమ సంపదను సాయం కోసం ఖర్చు చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే. ఇందుకు ఒక్కొక్కరూ ఒక్కో బాటను ఎంచుకుంటున్నారు. గుజరాత్ కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి తాజాగా చేపట్టిన ఒక సేవా కార్యక్రమం పలువురిని ఆకర్షించింది.

దానాలు ఎన్నో రకాలు. మిగిలిన దానాల్ని కాస్త పక్కన పెట్టిన ఈ సూరత్ వజ్రాల వ్యాపారి కన్యదానాల మీద ఫోకస్ చేశాడు. తండ్రి లేని అమ్మాయిలకు తానే తండ్రిని అయి.. మొత్తం 151 మంది అమ్మాయిలకు సామూహికంగా పెళ్లిళ్లు చేయించాడు. ఈ సందర్భంగా పెళ్లికూతళ్లకు తానే తండ్రిగా వ్యవహరించాడు. ప్రతి ఏటా సామూహిక వివాహాలు జరిపించే అలవాటు ఉన్నవజ్రాల వ్యాపారి మహేష్ సవానీ తాజాగా 151 మంది అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించాడు.

ఇందుకోసం రూ.5కోట్లు ఖర్చు చేసి.. మూడు రోజుల పాటు వివాహ వేడుకల్ని ఘనంగా జరిపించాడు. ఇతడు చేసిన సామూహిక వివాహాలకు..దాదాపు 10 వేల మందికి పైగా అతిధులు అతిధ్యం స్వీకరించారు. పెళ్లి కూతుళ్ల మధ్య కూర్చొని ఈ తండ్రి కాని తండ్రి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఏమైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదోలా సాయం చేయటానికి మించిన మానవత్వం ఇంకేం ఉంటుంది. ఈ వజ్రాల వ్యాపారి మనసు కూడా వజ్రం లాంటిదే కదూ.