Begin typing your search above and press return to search.
ఏపీలో కుటుంబాల కంటే తెల్లకార్డు ఎక్కువట!
By: Tupaki Desk | 31 May 2018 11:06 AM ISTనోరు తెరిస్తే చాలు.. తన గొప్పులు చెప్పుకోవటానికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టైం సరిపోతుంది. అలాంటి తీరు ఉండే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై తాజాగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.39 కోట్ల కుటుంబాలు ఉంటే తెల్లకార్డులు ఏకంగా 1.58 కోట్లు ఉన్నట్లుగా గుర్తించారు.
సాంకేతికంగా తాను చాలా తోపునని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటివి ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రజా సాధికార సర్వే డేటాను రేషన్ కార్డు డేటాబేస్ తో సరి చూడాలంటూ ఆహార కమిషన్ ఏపీ సర్కారుకు సిఫార్సు చేసింది.
ఈ సంచలన విషయం ఎలా బయటపడిందంటే.. ఇటీవల గుంటూరు జిల్లాలోని 5 మండలాలు.. విశాఖలోని అనకాపల్లి.. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలాల్లో క్రాస్ వెరిఫికేషన్ చేశారు. వీటిల్లో ఎమ్మిగనూరు మండలం పరిధిలోని 310 రేషన్ దుకాణాల్లో తనిఖీ చేస్తే 1.63 లక్షల తెల్లకార్డులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో 36 వేల తెల్లకార్డుల లెక్క తేల లేదు. కర్నూలు పట్టణం.. గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీ చేయిస్తే 166 చౌకడిపోల్లో 1.12 లక్షల కార్డులు ఉంటే.. వాటిల్లో 58 వేల కార్డుల జాడను గుర్తించలేకపోయారు.
ఈ లెక్కన రాష్ట్రం మొత్తంగా ఉన్న కుటుంబాలు ఎన్ని? తెల్ల కార్డులు ఎన్ని ఉన్నాయి? అన్న లెక్క తీస్తే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఏపీలో ఉన్న కుటుంబాల కంటే 19 లక్షల కార్డులు ఎక్కువగా ఉన్నట్లు తేలాయి. రియల్ గవర్నర్స్ తన దగ్గర ఉందని.. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా తనకు ఇట్టే తెలిసి పోతుందని చెప్పే బాబు.. ఇన్నేళ్లుగా ఇంత దారుణ తప్పిదాన్ని ఎలా చూస్తూ ఉండిపోయారంటారు?