Begin typing your search above and press return to search.

ముంబయిలో మాస్కు పెట్టుకోలేదని 15లక్షల మందికి ఫైన్

By:  Tupaki Desk   |   18 Feb 2021 8:00 AM IST
ముంబయిలో మాస్కు పెట్టుకోలేదని 15లక్షల మందికి ఫైన్
X
కరోనా ప్రభావం ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఈ మహమ్మారి కారణంగా దారుణంగా ప్రభావితమైన మహానగరాల్లో ముంబయి ఒకటి. ఈ మహానగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ నగరానికి ఎంతో ముఖ్యమైతే కానీ వెళ్లలేని పరిస్థితి దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినా.. మహారాష్ట్రంలో మాత్రం ఇంకా కొలిక్కి రాలేదనే చెప్పాలి. ఈ రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో అత్యధికం ముంబయి మహానగరంలోనే నమోదవుతున్నాయి.

కరోనాను కంట్రోల్ చేయటంలో కీలకమైన మాస్కు పెట్టుకునే విషయంలో ముంబయి నగర వాసులు మహా నిర్లక్ష్యంగా ఉంటారన్న విషయాన్ని తాజా గణాంకాలుస్పష్టం చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోని 15 లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు ఏకంగా రూ.30కోట్ల ఫైన్ వసూలు చేశారు. అయినప్పటికి.. మహానగర ప్రజల మైండ్ సెట్ మారటం లేదంటున్నారు. ఓవైపు ఫైన్ కడుతున్నారు.. మరోవైపు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నరన్న మాట పలువురు అధికారుల నోట వినిపిస్తోంది. సోమవారం ఒక్కరోజులోనే 13 వేల మందికి మాస్కు పెట్టుకోని కారణంగా ఫైన్ వేశారు.

గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఫిబ్రవరి 15 మధ్య కాలంలో మాస్కు ధరించని వారిపై కేసులు నమోదు చేసిన సంఖ్య అక్షరాలు 15,16,398గా చెబుతున్నారు. వీరి నుంచి రూ.30.69 కోట్లు వసూలు చేశారు. అయినప్పటికీ మాస్కులు పెట్టుకునే విషయంలో ముంబయి నగర వాసులు నిర్లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి లోకల్ ట్రైన్లు షురూ అయ్యాయి. నిత్యం 34 లక్షల మంది ఈ సబర్బన్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో.. కేసుల నమోదు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ.. కేసుల నమోదు మరింత పెరిగితే.. మరోసారి లాక్ డౌన్ తప్పదన్న వార్నింగ్ ఇస్తున్నారంటే.. దేశ ఆర్థిక రాజధాని పరిస్థితి ఎలా ఉందన్నది ఇట్టే అర్థం కాక మానదు.