Begin typing your search above and press return to search.

సగటున ఒక్కో ఎంపీ సీటుకు 15 మంది!

By:  Tupaki Desk   |   16 May 2019 6:13 AM GMT
సగటున ఒక్కో ఎంపీ సీటుకు 15 మంది!
X
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి సరాసరి 15 మంది చొప్పున పోటీలో ఉన్నారు. మొత్తం 542 ఎంపీ స్థానాలకు గానూ 8,039 మంది బరిలో దిగారు. కాగా అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో ఉన్న జాబితాలో టాప్‌ 10లో ఏడు స్థానాలను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఉండటం విశేషం. అయితే తెలంగాణలోని నిజామాబాద్‌ నుంచి అత్యధికంగా 185 మంది పోటీ చేస్తున్నారు.

అదేవిధంగా కర్ణాటకలోని బెళగావి నుంచి 57, తమిళనాడు రాష్ట్రం కరూరు స్థానం నుంచి 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ నివేదిక ప్రకారం అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టాప్‌ 10 జాబితాలో తమిళనాడు నుంచి ఐదు, కర్ణాటక నుంచి రెండు, తెలంగాణ నుంచి ఒకటి ఉన్నాయి. అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో ఉన్న జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉండటం విశేషం.

ఈ మేరకు దేశవ్యాప్తంగా 14.8 శాతం మంది ప్రతి లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఒక్కో స్థానం నుంచి సరాసరి 16.1 శాతం మంది పోటీ చేస్తున్నారు. కాగా తెలంగాణ అనంతరం తమిళనాడు నుంచి స్వతంత్య్ర అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. లోక్‌ సభ ఎన్నికల చరిత్రలో 1952 తర్వాత తమిళనాడులో అత్యధికంగా 202 మంది స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ చేస్తుండటం విశేషం. పార్టీల పరంగా పరిశీలిస్తే బీజేపీ నుంచి అత్యధికంగా 435, కాంగ్రెస్‌ 420, బీఎస్పీ 383, సీపీఎం 69, టీఎంసీ 62, సీపీఐ 48, ఎన్‌ సీపీ 34 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాయి.

అత్యధిక మంది బరిలో ఉన్న స్థానాలు
నిజామాబాద్‌›–›185
బెళగావి – 57
కరూర్‌ – 42
చెన్నై దక్షిణ – 40
తుత్తుకుడి – 37
చెన్నై సెంట్రల్‌ – 31
బెంగళూరు ఉత్తర – 31

జాతీయ పార్టీల వారీగా..
బీజేపీ – 435
కాంగ్రెస్‌ – 420
బీఎస్పీ – 383
సీపీఎం – 69
టీఎంసీ – 62
సీపీఐ – 48
ఎన్‌సీపీ– 34 స్థానాల్లో పోటీ చేస్తోంది.