Begin typing your search above and press return to search.

క‌రోనా కార‌కులు జైలుకు: 15 మంది త‌బ్లిగీ స‌భ్యుల అరెస్ట్‌

By:  Tupaki Desk   |   29 April 2020 6:31 PM IST
క‌రోనా కార‌కులు జైలుకు: 15 మంది త‌బ్లిగీ స‌భ్యుల అరెస్ట్‌
X
వాస్త‌వంగా భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం విజృంభించే అవ‌కాశ‌మే లేదు. క‌రోనా వైర‌స్ భార‌త్‌లో ఇంత‌గా వ్యాపించ‌డానికి కార‌ణం ఎవ‌రూ ఔన‌న్నా కాద‌న్నా త‌బ్లిగీ జ‌మాత్ ప్రార్థ‌న‌లే. ఢిల్లీలో జ‌రిగిన ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారిలో కొంద‌రికి కరోనా ఉండ‌డం.. సామూహిక ప్రార్థ‌న‌లు చేయ‌డంతో మిగ‌తా వారికి కూడా అంటుకున్న విష‌యం తెలిసిందే. వారి ద్వారా దేశ‌వ్యాప్తంగా తీవ్రంగా వ్యాపించి ప్ర‌స్తుతం 32 వేల‌కు చేరువ‌య్యాయి. ఇంత‌గా వైర‌స్ వ్యాప్తి చెంద‌డానికి కార‌ణ‌మైన త‌బ్లిగీ జ‌మాత్ సంస్థ‌పై కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఆ సంస్థ‌పై కేసులు న‌మోదు చేశారు. అందులో భాగంగా 15 మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

10 మంది బంగ్లాదేశానికి చెందిన తబ్లిగీ జమాత్‌ సభ్యులు ఉండ‌గా, మరో ఇద్దరు కోల్‌కతాకు చెందిన వారు కాగా, మరో ముగ్గురు షియోపూర్‌ వాసులుగా గుర్తించిన‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు తెలిపారు. వీరందరినీ గతంలోనే క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఇన్నాళ్లు వారు అజ్ఞాతంలో ఉన్నారు. జ‌మాత్‌కు వెళ్లిన వ‌చ్చిన వారంద‌రూ ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇవ్వాల‌ని కోరినా వారు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో వారిని గాలించి పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలో వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా నెగ‌టివ్ వ‌చ్చింది. అయితే 15మంది తబ్లీగ్ జమాత్ సభ్యులు క‌రోనా వ్యాప్తికి చెందేందుకు దోహ‌దం చేశార‌నే ఉద్దేశంతో వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు షియోపూర్ జిల్లా ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ్ ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ తీవ్ర రూపంలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 2,368 మందికి కరోనా కేసులు న‌మోదు కాగా, 113 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా పెరగడానికి తగ్లిగీ జమాత్‌ సభ్యుల కాంటాక్ట్‌ కేసులేనని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వారిని అరెస్ట్ చేశారు.