Begin typing your search above and press return to search.
1400 కిలోమీటర్లు ..మూడున్నర గంటలు .. తెలుగోడి గుండెకి ఆయువు ఎక్కువే !
By: Tupaki Desk | 12 Nov 2019 1:00 PM ISTఈ ఆధునిక కాలంలో అన్ని చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. ఒకప్పుడు గుండెకి సంబందించిన జబ్బు ఏదైనా వస్తే ..డైరెక్ట్ గా స్వర్గానికి టికెట్ తీసుకున్నట్టే అని చెప్పేవారు. కానీ , మారిన పరిస్థితులు ..పెరిగిన పరిజ్ఙానం తో దేవుడు ఇచ్చిన ఈ జన్మకి ..డాక్టర్స్ మరో దేవుళ్లుగా మారి పునర్జన్మలని ప్రసాదిస్తున్నారు. గుండెని తీసి మరో గుండెని అమర్చడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఏ మాత్రం కొంచెం పొరపాటు జరిగినా , సమయం కొంచెం ఆలస్యమైనా కూడా జరగరాని నష్టం జరిగిపోతుంది. సాధారణంగా ఒక మనిషి గుండెని బయటకి తీసిన తరువాత ..మరో వ్యక్తి శరీరంలో అమర్చాలి అంటే ..కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయం దాటిపోతే ఆ గుండె ఇక పనికిరాదు.
ఈ మధ్య కాలంలో ఇలా గుండె మార్పిడి ఆపరేషన్స్ చాలా జరుగుతున్నాయి. అలాగే గుండెని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకోని పోయే సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు , పోలీస్ యంత్రాగం ..ప్రజలు అందరూ బాగా సహాయం చేస్తున్నారు. ఎక్కడిక్కడ రూట్ క్లియర్ చేసి గుండెని తీసుకువెళ్లే వాహనానికి దారి ఇవ్వడంతో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీ లో జరిగింది. విజయవాడ నుండి ఢిల్లీ కి కేవలం మూడున్నర గంటల్లో గుండెని తీసుకోని వెళ్లి ..మరో వ్యక్తికి అమర్చారు.
దీని విషయం గురించి పూర్తిగా చూస్తే... న్యూఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడుతున్న ఒకరికి గుండెను మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం ఫోర్టిస్ ఆసుపత్రి డాక్టర్లు దేశవ్యాప్తంగా తమకు ఉన్న నెట్ వర్క్ ద్వారా పలు ఆసుపత్రులను సంప్రదించారు. చివరికి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె లభించింది. దూరం ఎక్కువ ..సమయం తక్కువగా ఉండటం తో ప్రభుత్వం ఆఘమేఘాహాలపై స్పదించి దేశ రాజధాని వరకూ ఆ హృదయాన్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా తేలికపాటి విమానాన్ని ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ గుండెను ఢిల్లీకి ఆ విమానం లో తీసుకోనివెళ్లారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఖ్లాలోని ఫోర్టిస్ ఆసుపత్రి వరకు మధ్య దూరం సుమారు 23 కిలోమీటర్లు. సాధారణంగా దేశ రాజధానిలో ఉన్న ట్రాఫిక్ ని పరిశీలిస్తే ఈ 23 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుంది. కానీ , సమయం తక్కువగా ఉండటంతో ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి ఫోర్టిస్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. విమానం నుంచి ల్యాండ్ అయిన వెంటనే రన్ వే మీద అందుబాటులో ఉంచిన ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ లో ద్వారా దాన్ని తరలించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల 23 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 19 నిమిషాల్లోనే అధిగమించారు. సకాలంలో గుండెను ఆసుపత్రికి చేర్చారు.