Begin typing your search above and press return to search.
మనిషి శరీరంలో 1.40 లక్షల వైరస్లు...! ఇది నిజం..!
By: Tupaki Desk | 23 Feb 2021 8:00 AM ISTమనిషి శరీరంలో లక్షా నలభై వేల వైరస్లు ఉంటాయట. ఈ వైరస్‌లన్నీ మనిషి శరీరంలోని జీర్ణాశయంలో పేగు గోడలకు అంటిపెట్టుకొని జీవిస్తుంటాయట. ఒక రకంగా మన శరీరమే వైరస్‌లను పెంచిపోషిస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, సూక్ష్మజీవులకు మానవ శరీరమే కేంద్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలు కూడా సాగుతున్నాయి. అయితే ఇన్ని వేల, లక్షల వైరస్‌లతో మనిషి ఎలా జీవిస్తున్నాడు.. అవి శరీరానికి హాని చేయవా? వాటితో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి? అనే ప్రశ్నలకు కూడా సైంటిస్టులే సమాధానాలు చెబుతున్నారు.
నిజానికి ఈ వైరస్లు మన శరీరంలో తిష్ట వేసే మాట నిజమే కానీ .. అవి మనిషికి ఏ రకమైన కీడు తలపెట్టవు. పైగా మేలు చేస్తాయి. ఈ విషయం కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే చాలా రకాల వైరస్‌లపై పరిశోధనలు కూడా జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మనకు తెలియని ఎన్నో రకాల వైరస్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిమీద నిరంతరాయంగా వైరాలజిస్టులు పరిశోధనలు సాగిస్తున్నారు.
అయితే మన శరీరంలో ఉండే వైరస్లు మాత్రం మన జీవక్రియకు తోడ్పడతాయి. జీర్ణక్రియ వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే వీటి డీఎన్ఏకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.
ఈ వైరస్లు ఎక్కువగా జీర్ణాశయాంతర గోడల్లో నివసిస్తుంటాయి. రోగ నిరోధకశక్తి పెంచేందుకు ఈ వైరస్లు తోడ్పడతాయట. సో.. ఇన్ని లక్షా నలభై వేల వైరస్లు మన శరీరంలో ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. అవి మన ఆరోగ్య పరిరక్షణ కోసమే పనిచేస్తుంటాయి..
