Begin typing your search above and press return to search.

స్పుత్నిక్-వీ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్..ముందే ఊహించామంటున్న రష్యా !

By:  Tupaki Desk   |   17 Sep 2020 2:00 PM GMT
స్పుత్నిక్-వీ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్..ముందే ఊహించామంటున్న రష్యా !
X
స్పుత్నిక్-వీ.. ప్రపంచంలోనే మొట్ట మొదటగా కరోనా నిరోధానికి సిద్ధమైన తొలి వ్యాక్సిన్. దీనిని రష్యా సిద్ధం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోకుండానే మార్కెట్లోకి వచ్చిందనే విమర్శలున్నాయి. ఈ టీకా పట్ల శాస్త్రవేత్తలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేశామని.. అందులో భాగంగా తన కుమార్తె కు కూడా టీకా వేసినట్లు ప్రకటించారు. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఇటీవల మార్కెట్ లోకి రాగా ఈ టీకా వేసుకున్న పలువురు సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డారు. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి కూడా నిర్ధారించారు. స్పుత్నిక్-వీ టీకా తీసుకున్న అనంతరం 14 శాతం మంది వలంటీర్లలో ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు తలెత్తాయి. దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ కూడా నిర్ధారించింది.

మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేయగా వారిలో 14శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ స్పుత్నిక్-వీతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మేం ముందే ఊహించాం. అయితే ఆరోగ్య సమస్యలన్నీ ఒకటి రెండు రోజుల్లో నయమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి, పంపిణీకి హైదరాబాద్ కు చెందిన సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే రెడ్డీస్ ల్యాబ్ కు 10 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి ఆర్డీఐఎఫ్ సిద్ధంగా ఉంది.