Begin typing your search above and press return to search.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 14 మంది మృతి !
By: Tupaki Desk | 20 Nov 2020 8:00 AM ISTఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. యూపీ ప్రయాగ్ రాజ్ మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ప్రతాప్‌గడ్‌లో ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారి పై గురువారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
కుండా నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీనితో బొలెరోలో ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. భారీ శబ్దంతో స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.