Begin typing your search above and press return to search.

సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్.. పోలీసుల రిపోర్ట్ లో కీలక విషయాలు

By:  Tupaki Desk   |   25 Jun 2022 10:08 AM GMT
సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్.. పోలీసుల రిపోర్ట్ లో కీలక విషయాలు
X
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు దర్యాప్తులో కీలక సూత్రధారిగా అభివర్ణిస్తున్న సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక రిపోర్ట్ ను రూపొందించారు. ఇది సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బారావును ప్రధాన కుట్రదారుగా తేల్చారు. ఈ క్రమంలోనే సుబ్బారావుతోపాటు అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని తేలింది. ఏపీకి చెందిన ఈ కోచింగ్ నిర్వాహకుడు తెలంగాణలోని హైదరాబాద్ లో సాయి కోచింగ్ సంస్థ పేరిట నిర్వహించి నిరుద్యోగులను రెచ్చగొట్టాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలిసింది.

జూన్ 16న సుబ్బారావు సికింద్రాబాద్ వచ్చాడని.. అదే రోజు హోటల్ లో అనుచరులతో భేటి అయ్యాడని తెలిసింది. ఈ భేటీలోనే విధ్వంసానికి భారీ ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సుబ్బారావు తెలిపిన సమాచారాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. మరికాసేపట్లో అతడిని అరెస్ట్ రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుబ్బారావు ఈ అల్లర్లలో సూత్రధారి అని.. 'శివ', మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే నలుగురు అనుచరులతో కలిసి విద్యార్థులను రెచ్చగొట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. సుబ్బారావు ఆదేశాలతోనే గ్రూపుల్లో ఆందోళనలు చేయాలని అనుచరులు పిలుపునిచ్చినట్లు సమాచారం.గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనలకు సుబ్బారావు స్కెచ్ వేసినట్లు గుర్తించారు. నరేష్ అనే మరో అనుచరుడు ఆందోళనకారులకు భోజనం అందజేసినట్టు తేలింది. నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణ ముగియడంతో కోర్టు సుబ్బారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. సుబ్బారావుతోపాటు అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీరెడ్డిలకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.

ఈ కేసులో ఏ64 సుబ్బారావు. ఏ65 మల్లారెడ్డి, ఏ66 శివకుమార్, ఏ67 బీసీరెడ్డిని అడ్డం పెట్టుకొని ప్లాన్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ విధ్వంసానికి యువకులను సుబ్బారావు రెచ్చగొట్టాడని తెలిపారు. ఈనెల 16న సుబ్బారావు నరసరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చారని.. బోడుప్పల్ లోని లాడ్జిలో సుబ్బారావు బస చేశారని చెప్పారు. స్టేషన్ లో విధ్వంసానికి మద్దతిస్తున్నట్టుగా వాట్సాప్ లో పోస్టులు చేశాడని వెల్లడించారు.