Begin typing your search above and press return to search.

13,400 మంది ఉద్యోగులకు ట్రంప్ ‘సెలవు’

By:  Tupaki Desk   |   1 July 2020 1:40 PM IST
13,400 మంది ఉద్యోగులకు ట్రంప్ ‘సెలవు’
X
కరోనా మహమ్మారి వ్యాప్తితో బడ్జెట్‌లో కొరత నేపథ్యంలో అమెరికా ఖాళీగా ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే వారిని ఇతర ఉద్యోగాల్లోనూ వాడుకోవడానికి రెడీ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసలను డిసెంబర్ వరకు దేశంలోకి నిషేధించడంతో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లో పనిచేస్తున్న 13,400 మంది ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు. వారిని సెలవులో ఇంటికి పంపేందుకు నోటీసులు పంపుతున్నారు. ఆగస్టు వరకు ఖాళీగా ఉండాలని.. అప్పుడు పరిపాలన చర్యలు ప్రారంభమైతే పిలుస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఉద్యోగులకు ఆగస్టు 3 వ తేదీ వరకు సెలవులో వెళ్లాలని నోటీసులు పంపబడ్డాయి. 30 రోజుల కన్నా ఎక్కువగానే కొందరిని సెలవులో పంపారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మూడు నెలల పాటు వారిని ఇంటికే పరిమితం చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. కరోనా పరిస్థితుల ఆధారంగా ఉండే ఎక్కువ కాలం వారంతా ఉద్యోగాలకు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది.

అయితే ఇమిగ్రేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత వారం సెలవుల గురించి మాత్రమే సమాచారం ఇచ్చారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 73% మంది ఉద్యోగులను ప్రస్తుతం తొలగిస్తూ ఇంటికి పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం, సెలవులపై వెళ్లాలనుకునే ఉద్యోగులందరూ 30 నుండి 90 రోజుల మధ్య డ్యూటీయేతర రాష్ట్రాల కోసం అవసరమైతే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.