Begin typing your search above and press return to search.
నెలకు కోటిన్నర డోసులే.. త్వరలో 13 కోట్ల డోసులు
By: Tupaki Desk | 16 May 2021 12:00 PM ISTదేశీయంగా అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ సిద్ధం చేసిన కొవాగ్జిన్ తరచూ వార్తల్లోకి రావటం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కు పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అయితే.. అందుకు తగినట్లుగా ఉత్పత్తి లేని పరిస్థితి. ఇలాంటి వేళలో.. కొవాగ్జిన్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారు చేసే భారత్ బయోటెక్ నెలకు కోటిన్నర డోసుల్ని మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. త్వరలోనే ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుంది.
ఇదే విషయాన్ని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టం చేస్తున్నారు. సజీవ వైరస్ ను నిర్వీర్యం చేయటం ద్వారా కొవాగ్జిన్ ను రూపొందిస్తారు. ఇందుకు బీఎస్ఎల్ 3 లేబొరేటరీలు అవసరమవుతాయిన చెప్పారు. ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికిప్పుడు తయారు చేయటం సాధ్యం కాదని.. ఎక్కడ ప్రభుత్వ కర్మాగారాలు ఉంటే.. అక్కడ ఓకే చెప్పేస్తే ఉత్పత్తి చేయటం కుదరదని తేల్చారు.
కొవాగ్జిన్ ఉత్పత్తిని రోజురోజుకు పెంచుతున్నారు. ప్రస్తుతానికి నెలకు కోటిన్నర కు డోసుల ఉత్పత్తికి చేరుకుందని.. ఆగస్టు నాటికి 7.5 కోట్ల డోసులకు పెరుగుతుందని.. త్వరలో మరో మూడు ప్రభుత్వ రంగం సంస్థలు కలుస్తున్నందున.. ఈ సామర్థ్యం 13 కోట్ల డోసులకు పెరగనుంది. ఎవరో చెప్పటం వల్లే కొవాగ్జిన్ తయారీకి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందాలు జరిగినట్లుగా సాగుతున్న ప్రచారానికి పొంతన లేదని వీకే పాల్ స్పష్టం చేస్తున్నారు. కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని పెంచేందుకు ఇటీవల కాలంలో బోలెడన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాదనలో నిజం లేదన్న విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాటల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.