Begin typing your search above and press return to search.

నరేంద్రమోడీ సొంత రాష్ట్రంలోనూ కరోనా కల్లోలం

By:  Tupaki Desk   |   22 March 2020 10:35 AM IST
నరేంద్రమోడీ సొంత రాష్ట్రంలోనూ కరోనా కల్లోలం
X
ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ముఖ్యమంత్రి విజయ్ రుపాని తెలిపారు. దీంతో గుజరాత్ లోనూ హై అలెర్ట్ ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సీఎం విజయ్ రుపాని కోరారు. రాష్ట్రంలో మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాజ్ కోట్, బరోడా, అహ్మదాబాద్, సూరత్ లలో ఐసోలేటెడ్ ఇన్ ఫెక్షన్ కంట్రోల్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం రుపానీ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

గుజరాత్ లోనూ 31వ తేదీ వరకూ అన్ని మూసివేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం ఈనెల 31వ తేదీ వరకూ మూసివేయాలని గుజరాత్ సీఎం నిర్ణయించారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని.. విద్యాసంస్థలు, జిమ్ లు, మ్యూజియంలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్విమ్మింగ్ ఫూల్స్, థియేటర్స్ ఈనెల 31 వరకు బంద్ అని సీఎం రుపానీ తెలిపారు.