Begin typing your search above and press return to search.
2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం.. దేని వల్లంటే !
By: Tupaki Desk | 21 Oct 2020 2:40 PM ISTసైబర్ క్రైమ్ ..ప్రస్తుత రోజుల్లో ఇదొక ఫ్యాషన్. క్షణాల్లో లక్షలు , కోట్లు దోచేస్తున్నారు. మనం మోసపోతున్నామా అనే అనుమానం వచ్చే సరికి, మనల్ని ముంచేసి డబ్బు లాగేసుకుంటున్నారు. ఈ తరహా కేసుల్ని ఛేదించడానికి , అలాగే సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో చిక్కకుండా కాపాడటానికి పోలీసులు ఉన్నప్పటికి , రోజుకో కొత్త వ్యూహం తో ఆలోచించే లోపే ఆచరణ లో పెట్టేసి కానీ కానిచ్చేస్తున్నారు. రోజురోజుకి ఈ సైబర్ నేరగాళ్ల భారిన పడే వారి సంఖ్య పెరుగుతూపోతోంది. సైబర్ నేరాల కారణంగా 2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం ఏర్పడినట్టు ‘నేషనల్ సైబర్ సెక్యూరిటీ’ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ తెలిపారు.
స్మార్ట్ పట్టణాల అభివృద్ధిని చేపట్టడంతోపాటు 5జీ నెట్ వర్క్ ను అమల్లోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తు లోనూ సైబర్ నేరాల ముప్పు పెరిగే అవకాశం ఉందని అయన హెచ్చరించారు. భారత్ లో కేవలం కొన్ని కంపెనీలే సైబర్ భద్రతా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటూ.. ఈ రంగంలో ఎంతో శూన్యత నెలకొందన్నారు. విశ్వసనీయమైన దేశీయ పరికరాల అభివృద్ధి ద్వారా సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రంగానికి సంబంధించి ఒక ఫోరమ్ అవసరాన్ని రాజేష్ పంత్ గుర్తు చేశారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు.
మొబైల్ ఫోన్ల వంటి పరికరాలకు ఎన్నో ప్రమాదాలున్నాయి. మొబైల్ ఫోన్‌పై దాడుల తీరును మేము విశ్లేషించి చూశాము. కేవలం యాప్‌లపైనే కాదు.. 15 రకాల భిన్న మార్గాల్లో దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, కమ్యూనికేషన్ ఇంటర్ ఫేస్, బ్లూటూత్, వైఫై కూడా వీటిల్లో ఉన్నాయి అని రాజేష్ పంత్ తెలిపారు. ఫోన్లలో ముందుగానే ఇన్ స్టాల్ అయి ఉండే యాప్ లు చాలా వరకు డేటాను తరలిస్తున్నట్టు చెప్పారు. అందుకే మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.