Begin typing your search above and press return to search.
ఆ దేశంలో భారీగా కేసులు.. టీకాకు రూ.2800 ఇస్తామన్నా నో!
By: Tupaki Desk | 17 Nov 2021 10:40 AM ISTఇలాంటి పరిస్థితి మరే దేశానికి రాకూడదు. నిజానికి ఇంతకు మించిన కష్టం మరొకటి ఉండదు. ఓవైపు కరోనా కేసులు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నా.. ప్రజలు మాత్రం టీకాలు వేసుకోవటానికి ముందుకు రాకపోతున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ ఆ దేశం ఏమిటి? ఇప్పుడక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. షాకింగ్ గా మారిందని చెప్పాలి.
ఇంతకీ ఆ దేశం మరేదో కాదు.. ఉక్రెయిన్. ఒకప్పుడు సోవియెట్ యూనియన్ లో భాగమైన ఈ దేశం.. 1991లో విడిపోయిందన్న సంగతి తెలిసిందే. దగ్గర దగ్గర ఐదు కోట్ల మంది జనాభా ఉండే ఈ దేశంలో మంగళవారం ఒక్కరోజులోనే 12వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇంత భారీగా కేసులు వ్యాపిస్తున్న వైనంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనాకు చెక్ పెట్టేందుకు ఆ దేశం వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేపట్టినా.. ఉక్రెయిన్లు మాత్రం టీకా వేసుకోవటానికి ముందుకు రాకపోవటంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 19.8 శాతం మంది మాత్రమే వేసుకున్నారు. దీంతో.. టీకా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకు తగ్గట్లే.. టీకా వేసుకునే వారికి రూ.2812 చొప్పున ఇస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ప్రజల నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో తల పట్టుకుంటోంది. ప్రజల చేత టీకా ఎలా వేయించాలన్నది వారికో సవాలుగా మారింది.ఒక్క సోమవారం నాడే 12వేల కొత్త కేసులతో పాటు.. 838 మంది ప్రజలు కరోనా కారణంగా కన్నుమూయటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ టీకా వేసుకోవటానికి ప్రజల్లో పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
2. ఇదిలా ఉంటే..కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు.. దాని సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఇబ్బంది ఎదురైతే.. అలాంటి వారికి పరిహారం ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఆ దేశంలో 10వేల అప్లికేషన్లు ప్రభుత్వానికి అందాయి. ఈ పరిహారం మొత్తం ఒక్కొక్కరికి సగటున రూ.2.73 లక్షల వరకు ఇవ్వొచ్చంటున్నారు. అంటే.. దాదాపు రూ.275 కోట్ల మొత్తాన్ని పరిహారంగా ఇవ్వనున్నారు.
3. మరోవైపు.. అమెరికా కీలక ప్రకటన చేసింది. ఎఫ్ డీఐ అనుమతి పొందిన టీకాల్ని వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతి ఇస్తామంటూ అమెరికా వెల్లడించింది. అంతేకాదు.. ఎఫ్ డీఏ ఆమోదం ఉన్న టీకాల్ని పూర్తిగా వేయించుకున్న వారు భారత్ కు వెళ్లటం క్షేమమేనని పేర్కొంది. దీంతో.. అమెరికన్లు పెద్ద ఎత్తున భారత్ కు ప్రయాణించేందుకు అవకాశాలు మరింతగా మెరుగుపడినట్లేనని చెప్పాలి.
4. కరోనాకు సంబంధించి మన దేశానికి వస్తే.. గడిచిన 287 రోజుల్లో ఎప్పుడూ లేనంత తక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం దేశ వ్యాప్తంగామొత్తం 8865 కేసులు మాత్రమే నమోదైనట్లుగా తేల్చాయి. ఇక.. మరణాలు 197గా తేల్చారు. గడిచిన తొమ్మిది నెలల్లో అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదైన ఉదంతం ఇదేనని చెబుతున్నారు.
5. ఇక.. దేశ వ్యాప్తంగా టీకాలు వేసుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు వేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. ఈ స్టిక్కర్లు వేసే కార్యక్రమంతో.. మిగిలిన వారిలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలన్న ఆలోచన వస్తుందని భావిస్తున్నారు.