Begin typing your search above and press return to search.

సంచలనం..: అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై 12 మిస్సైళ్లు..

By:  Tupaki Desk   |   13 March 2022 6:30 AM GMT
సంచలనం..: అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై 12 మిస్సైళ్లు..
X
ఉక్రెయిన్ దేశంపై రష్యా 18 రోజులుగా దాడి చేస్తోంది. ఓ వైపు చర్చల సాగుతూనే.. మరోవైపు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకునేందుకు యత్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ అందుకు ధీటుగా ఎదుర్కొంటోంది. పలు నగరాలనే రష్యా ఆధిపత్యం వహించినప్పటికీ కొన్ని నగరాల్లో మాత్రం ఉక్రెయిన్ పౌరులు సైతం ఎదుర్కోవడంతో రష్యా వెనక్కి తగ్గాల్సి వస్తోంది. కానీ రష్యా మాత్రం యుద్ధం ఆపడం లేదు. ఇదిలా ఉండగా ఈ క్రమంలో ఇరాక్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై ఇరాన్ మిసైల్ ను పంపింది. ఈ దాడిలో ప్రాణా నష్టం ఏం జరగకపోయినా అమెరికా లక్ష్యంగా ఇరాన్ దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఉక్రెయిప్ పై రష్యా దాడి చేస్తున్న క్రమంలో అమెరికా సహా యూరప్ దేశాలు ఉక్రెయిన్ ను మద్దతు ఇస్తూ వస్తున్నాయి. ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం లేకున్నా ఆ దేశానికి అండగా ఉంటున్నాయి. అయితే ఉక్రెయిన్ కు ప్రధానంగా అండగా ఉండడంతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై బైడెన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడం రష్యా మిత్ర పక్షాలు సహించలేకపోతుందని కొందరు అంటున్నారు. ఈ తరుణంలోనే అమెరికాను ఇరాన్ టార్గెట్ చేసిందని అంటున్నారు.

ఉక్రెయిన్ కు అండగా ఉంటున్న అమెరికా నేరుగా మిలటరీ సాయం చేయకపోయినా ఆర్థికంగా కట్టడి చేస్తోంది. పలు వాణిజ్య సంబంధాలను కట్ చేయిస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ కు ఆయుధాలను అందిస్తోంది. దీంతో రష్యా ఊహించినంత ఈజీగా ఉక్రెయిన్ చిక్కడం లేదు. దీంతో ఇరాన్ అమెరికాను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్న చర్చ సాగుతోంది. ఇరాక్ లోని అమెరికా కాన్సులేట్ పై మిస్సైల్ తో దాడి చేసింది.

ఆదివారం తెల్లవారుజామున డజన్ కు పైగా క్షిపణులను సందించింది. ఇరాన్ భూభాగంపైనుంచి ఇరాక్ కు 12 బాల్లిస్టిక్ మిస్సైళ్లు ఇరాక్లోని తమ కార్యాలయం వైపు దూసుకొచ్చాయని అమెరికా నిర్దారించింది.

ఇరాక్ లోని ఉత్తర ప్రాంతంలోని ఇర్బిల్ సిటీలో ఉంటుంది. అమెరికన్ కాన్సులేట్, ఇరాన్, టర్కీ దేశాల సరిహద్దులకు సమీపంలో ఇర్బిల్ నగరం ఉంటుంది. కుర్దిస్తాన్ రీజియన్లోని అతిపెద్ద నగరం ఇదే. సుమారు 15 లక్షల వరకు జనాభా ఉంటుంది. అయితే అక్కడున్న అమెరికా కాన్సులేట్ నగరం టార్గెట్ చేసుకొని ఆదివారం తెల్లవారుజామున మిస్సెళ్లను పంపించిందని అంటోంది అమెరికా.

అయితే ఈ ఘటనలో ప్రాణాపాయం ఏమీ లేనప్పటికీ దాడులు జరిగిందనేది మాత్రం వాస్తవం అన్నారు.అయితే ఇరాక్ సైన్యాధికారులు వేరేలా అంటున్నారు. అమెరికాన్ కాన్సులేట్, పరిసర ప్రాంతాలు ధ్వంసం అయ్యాయని అయ్యాయని అంటోంది. ఎలాంటి సంకేతం లేకుండా ఈ మిస్సైళ్లు ఇరాక్ పైకి వచ్చాయని ఆ దేశం ఆరోపిస్తోంది.

ఈ దాడికి కారణం ఓ విషయం సర్క్యులేట్ అవుతోంది. సిరియాలోని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ ఇటీవలే వైమానిక దాడులను సాగించిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో ఇద్దరు రివాల్యూషనరీ గార్డ్స్ మరణించారు. అందుకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోందని అంటున్నారు. అయితే ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ ల దాడి కొనసాగుతుండగానే.. మరోవైపు అమెరికాను టార్గెట్ చేసుకొని మిస్సైల్ పంపడం చర్చనీయాంశంగా మారింది.