Begin typing your search above and press return to search.
సుదీర్ఘ భేటీలో ఎటూ తేల్చని చైనా: అర్ధాంతరంగా చర్చలు ముగింపు
By: Tupaki Desk | 1 July 2020 2:00 PM ISTభారత్- చైనా మధ్య విబేధాలు ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. లఢక్ సమీపంలోని సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు దేశాల భూభాగాలపై మోహరింపులు కొనసాగుతూనే వస్తున్నాయి. వ్యూహాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు దేశాల తరఫున భారీగా యుద్ధ సామగ్రిని తరలించారు. భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి సాగుతోన్న ప్రయత్నాలు ముందుకు సాగట్లేదు. ఈ క్రమంలో చర్చలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. తాజాగా అదే పరిణామం చోటుచేసుకుంది.
భారత్-చైనా దేశాల మధ్య తాజాగా మూడో విడతగా చోటుచేసుకున్న చర్చలు కూడా అర్ధాంతరంగా ముగిశాయి. మంగళవారం ఉదయం 10:30 గంటలకు రెండు దేశాల లెఫ్టినెంట్ కమాండర్ స్థాయి అధికారులతో ఆరంభమైన ఈ సమావేశం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ఇదివరకు ఈ నెల 6, 22వ తేదీల్లో నిర్వహించిన సమావేశం తరహాలోనే అర్ధాంతరంగా ముగిశాయి. తొలిసారిగా భారత భూభాగంపై ఈ చర్చలు సాగాయి. సరిహద్దులకు ఇవతల ఉన్న ఛుసుల్ ప్రాంతంలో భేటీ కొనసాగింది. చర్చల సందర్భంగా భారత్ సరిహద్దుల్లో ఏప్రిల్‌కు ముందు నాటి పరిస్థితులను తీసుకుని రావడం.. ఏప్రిల్‌కు ముందు వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. అలాంటి వాతావరణాన్నే కల్పించాలని, ఉద్రిక్తతలను తగ్గించడానికి తొలి అడుగు వేయాలంటూ భారత్ కోరింది.
ఈ ఒక్క డిమాండ్‌కు అంగీకరిస్తే చాలని భారత లెఫ్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్ ప్రస్తావించగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది. భారత డిమాండ్ పై చైనా లెఫ్టినెంట్ కమాండర్ లియు లిన్ ఏ మాత్రం అంగీకరించలేదని, పైగా డొంక తిరుగుడు మాటలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించారని చర్చ నడుస్తోంది. చర్చల్లో పాల్గొన్న భారత ఆర్మీ ప్రతినిధులపై మైండ్‌గేమ్ వ్యూహాన్ని అనుసరించడానికి ప్రయత్నించిదని చెబుతున్నారు. దీన్ని హర్వీందర్ సింగ్ సారథ్యంలోని ఆర్మీ ప్రతినిధులు తిప్పి కొట్టినట్లు తెలుస్తోంది.
భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా మొదటి తప్పు చేసిందని, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆ దేశంపైనే ఉందని భారత్ వాదించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి హాట్‌స్పాట్‌గా మారిన గాల్వన్ వ్యాలీని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భారత ప్రతినిధులు డిమాండ్ చేశారం. చైనా అంగీకరించలేదని తెలుస్తోంది. చైనా తన సైనిక శిబిరాలను ఏర్పాటుచేయగా వాటిని తొలగించాలని భారత ఆర్మీ ప్రతినిధులు పదేపదే డిమాండ్ చేసినప్పటికీ.. చైనా నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో మూడో విడత చర్చలు కూడా అర్ధాంతరంగా వాయిదా వేశారు. మరో విడత చర్చలపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వాస్తవాధీన రేఖ వెంట ఉన్న గాల్వన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్, ఫోర్ ఫింగర్స్ పాయింట్స్, హాట్ స్ప్రింగ్, పెట్రోల్ పాయింట్-14, పెట్రోల్ పాయింట్స్-15, 17ఏ, గోగ్రా పోస్ట్ వంటి ప్రదేశాల్లో చైనా సైనికులు శిబిరాలను ఏర్పాటు చేశావాటిని తొలగించాల్సి ఉంటుందని, ఏప్రిల్‌కు ముందు నాటి పరిస్థితులను పునరుద్ధరించాల్సి ఉంటుందనేది ప్రధాన డిమాండ్ చేయగా.. దానికి చైనా అంగీకరించలేదు.