Begin typing your search above and press return to search.
ఆమెకు అరటిపండు అంత అద్భుతం చేసిందా?
By: Tupaki Desk | 17 May 2020 6:00 AM ISTఇలానే చేయాలని మేం చెప్పటం లేదు. ఆ మాటకు వస్తే.. మీరిలా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని ప్రోత్సహించటం మా ఉద్దేశం కాదు. ఒకరి విషయంలో జరిగిన అద్భుతాన్ని మీ వరకూ తీసుకురావటమే తప్పించి.. ఇలా చేస్తే.. ఇలానే జరుగుతుందని బల్లగుద్ది చెప్పటం లేదన్నది మర్చిపోకూడదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వార్తను చదివితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది సుమా.
అనగనగా ఒకామె. ఆమె పేరు యూలియా. ఆమె రూపొందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ వీడియో చాలా పాతది. మరిప్పుడు దీని ముచ్చట ఎందుకంటే.. లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది తమ హెల్త్ మీదా.. శరీరం మీదా చాలానే ప్రయోగాలు చేస్తున్నారు. బిజీ లైఫ్ కు భిన్నమైన జీవితాన్ని గడుపుతున్న ఈ సమయంలోనే ఇలాంటివి ఏమైనా చేస్తే ఫలితం ఉంటుందన్న భావన కూడా.. తాజా వీడియో వైరల్ కావటానికి కారణంగా చెప్పక తప్పదు.
ఇంతకీ ఆమె చేసిన ప్రయోగం ఏమంటే.. పన్నెండు రోజుల పాటు మూడు పూటలా అరటి పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంది. ఇలా కేవలం అరటిపండ్లు మాత్రమే తినటంతో తన శరీరంలోని విష పదార్థాలన్ని ఒక్కసారిగా బయటకు వెళ్లిపోయినట్లుగా యూలియా చెబుతోంది. అంతేకాదు.. ఏకాగ్రత పెరగటంతో పాటు.. చురుకుదనం పాళ్లు కూడా పెరిగినట్లు చెబుతోంది.
మెదడు చురుగ్గా ఉండటం.. రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు.. ఎంత కఠినంగా పని చేసినా నీరసం అన్నదే లేదని పేర్కొంది. చర్మంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని.. గతంతో పోలిస్తే.. స్కిన్ చాలా కాంతి వంతంగా మారినట్లు ఆమె చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. బరువులో మార్పులు రావటమే కాదు.. బాడీ ఫ్లెక్సిబుల్ గా మారినట్లుగా చెప్పింది.
మూడు పూటలకు అవసరమైనన్ని అరటి పండ్లు తినటం.. అవసరమైన నీటిని తీసుకోవటం.. సరైన సమయంలో నిద్ర.. వ్యాయామం చేయటం ద్వారా పన్నెండు రోజుల్లో అద్భుతాల్ని సాధించినట్లుగా ఆమె పేర్కొంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న లాక్ డౌన్ వేళ.. ఇలాంటి ప్రయోగాలకు పర్ ఫెక్టు గా ఉంటుందని చెబుతున్నారు. ఇంటి పట్టున ఉండటం కారణంగా అరటిపండు దీక్షతో ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇది కేవలం సమాచారం మాత్రమే. దీని ఆధారంగా నిర్ణయం తీసుకునే కన్నా.. నిపుణులు.. తెలిసిన వైద్యులతోనే ఇలాంటి ప్రయోగాలు చేయటం మంచిదన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చి పోవద్దు.