Begin typing your search above and press return to search.

11,110.. ఆ కుర్రాడి పిత్తాశయంలో ఉన్న రాళ్లు

By:  Tupaki Desk   |   10 Sept 2015 6:57 AM IST
11,110.. ఆ కుర్రాడి పిత్తాశయంలో ఉన్న రాళ్లు
X
కిడ్నీలో స్టోన్ ల మాదిరే.. గాల్ బ్లాడర్ లో రాళ్లు మామూలే. మారిన జీవనశైలి పుణ్యమా అని గాల్ బ్లాడర్ లో రాళ్లు చేరటం ఈ మధ్య కాలంలో తరచూ చోటు చేసుకుంటోంది. ఈ రాళ్లు ఏ మాత్రం అడ్డుపడినా.. భరించలేనంత నొప్పు కలుగుతుంది.

ఇలాంటి నొప్పినే అనుభవించిన ఒక యువకుడి పిత్తాశయం (గాల్ బ్లాడర్) నుంచి వేలాది రాళ్లు బయటకు తీశారు. సాధారణంగా పిత్తాశయంలో రాళ్లు అయితే.. ఐదు లేదంటే పదిలా ఉంటాయి. కానీ.. పశ్చిమ బెంగాల్ కు చెందిన కమల్ బజాజ్ అనే ఇరవైఏళ్ల కుర్రాడు కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి రావటంతో వైద్యులు పరీక్షించి.. పిత్తాశయంలో రాళ్లుగా తేల్చారు.

తాజాగా అతని గాల్ బ్లాడర్ లో ఉన్న రాళ్లను వెలికి తీసేందుకు బుధవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న రాళ్లతో వైద్యులు విస్మయం చెందుతున్నారు. ఎంతకూ తరగవన్నట్లుగా భారీగా రాళ్ల మీద రాళ్లు రావటంతో వైద్యుల నోట మాట రాని పరిస్థితి. సుదీర్ఘకాలంగా సాగిన ఈ ఆపరేషన్ లో మొత్తంగా 11,110 రాళ్లు తీయటం వైద్యులకు సైతం షాక్ తగిలేలా చేసింది. పిత్తాశయంలో ఇన్నేసి వేల రాళ్లు ఉండటం చాలా అరుదని చెబుతున్నారు. చూస్తుంటే.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన మొత్తం రాళ్లు కానీ ఒకేచోట పెడితే.. ఓ గుట్ట కావటం ఖాయమేమో.