Begin typing your search above and press return to search.

చైనా అధీనంలో 1100 చదరపు కి.మీ.?

By:  Tupaki Desk   |   2 Sept 2020 9:45 AM IST
చైనా అధీనంలో 1100 చదరపు కి.మీ.?
X
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం తెలిసిందే. సరిహద్దు దేశాల విషయంలో దారుణంగా వ్యవహరించే చైనా.. తన డ్రాగన్ బుద్ధిని పదే పదే ప్రదర్శిచటం తెలిసిందే. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆ దేశంలో యద్ధకాంక్ష ఎక్కువైంది. తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితోనూ ఏదో రీతిలో లాడాయి పెట్టుకునే ఆ దేశం ఇటీవలకాలంలో దాదాపు 1100 చదరపుకిలోమీటర్ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థ ద హిందూ పేర్కొంది.

తాజాగా ఆ మీడియా సంస్థ వెబ్ సైట్ లో ఈ సంచలన కథనాన్ని పోస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిఒకరు తమకు ఇచ్చిన సమాచారం ప్రకారం లద్దాఖ్ లోని ఎల్ ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో భారత్ కు చెందిన 1100 చదరపు కిలోమీటర్ల భూభాగం డ్రాగన్ దేశ అధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

దెప్సాంగ్ నుంచి చుశుల్ వరకు ఈ ఆక్రమణలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. దెప్సాంగ్ మైదానంలోని పెట్రోలింగ్ పాయింట్ 10 నుంచి 13 వరకు 900 చదరపు కిలోమీటర్లు చైనా నియంత్రణలోకి వెళ్లినట్లుగా వెల్లడించింది. గల్వాన్ లోయలో 20 చదరపు కిలోమీటర్లు.. హాట్ స్ట్రింగ్ ప్రాంతంలో 12 చదరపు కిలోమీటర్లు.. పాంగాంగ్ వద్ద 65 చదరపు కిలోమీటర్లు.. చుశుల్ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది.

పాంగాంగ్ వద్ద ఉన్న ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు ఉన్న ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న భూభాగం మీదా డ్రాగన్ కన్ను పడిందని ఒక కీలక అధికారి పేర్కొన్నట్లు ద హిందూ కథనం చెబుతోంది. చూస్తుంటే.. చైనా దుర్మార్గం అంతకంతకూ పెరుగుతుందని చెప్పక తప్పదు.