ఆ యాప్స్ వల్ల 5 లక్షల మందికి టోకరా .. 11 మంది అరెస్ట్ !

Thu Jun 10 2021 14:00:01 GMT+0530 (IST)

110 fake companies ... 5 lakh people in 2 months

గూగుల్ ప్లే స్టోర్ లో లిస్టయిన పవర్ బ్యాంక్ పేరుతో ఇన్వెస్ట్ మెంట్ యాప్ సాయంతో  5లక్షల మందికి పైగా ప్రజలను ఓ ముఠా కేవలం 2 నెలల్లోనే కుచ్చుటోపీ పెట్టింది. ఈ ముఠాలోని 11 మంది సభ్యులను ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా అమాయకులకు మదుపులపై ఆకర్షణీయమైన త్వరితగతిన రిటర్న్స్ వస్తాయని నమ్మించింది. ఢిల్లీ పోలీసు సైబర్ స్పెషల్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ మాట్లాడుతూ.. పవర్ బ్యాంక్ ఈజడ్ ప్లాన్ అనే యాప్‌ల గురించి సోషల్ మీడియా ద్వారా తమకు వందల ఫిర్యాదులు అందాయన్నారు. తమకు ఫిర్యాదులు చేసిన వారిలో కొందరు రూ. లక్షల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పవర్ బ్యాంక్ యాప్ వేల సంఖ్యలో డౌన్ లోడ్ అయిందని చెప్పారు.ఈ యాప్ స్రుష్టికర్తలు యజమానులు చైనాలో ఉన్నారని డీసీపీ చెప్పారు. పవర్ బ్యాంక్ యాప్ స్టార్టప్ బెంగళూర్ కేంద్రంగా ఏర్పాటైనట్లు కనిపిస్తుందన్నారు. కానీ దాని సర్వర్ చైనాలో ఏర్పాటైందన్నారు. పెట్టుబడులపై 5-10 శాతం ఇన్‌స్టంట్ రిటర్న్స్ వస్తాయని యాప్ ప్రారంభంలో ఆఫర్ చేసి పలువురు యూజర్లను ఆకర్షించిందని అది నమ్మి అమాయకులు భారీగా పెట్టుబడులు పెట్టారు. యాప్ యూజర్ల ఖాతాలను బ్లాక్ చేశామని డీసీపీ అన్యేష్ రాయ్ వివరించారు. యాప్ యజమానిని ట్రేస్ చేసేందుకు ఢిల్లీ స్పెషల్ సైబర్ సెల్ దర్యాప్తు టీం క్రియేట్ చేసిందని చెప్పారు.

పశ్చిమబెంగాల్‌లోని ఉలుబేరియాకు చెందిన వ్యక్తి షేక్ రూబిన్ను ఈ నెల 2న షేక్ రూబిన్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి గుర్తింపు కోసం ఎన్సీఆర్‌కు తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు. మరో 9 మందిని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అరెస్ట్ చేశామన్నారు. నిందితుల్లో ఇద్దరు అవిక్ కేడియా రొనాక్ బన్సాల్ చార్టర్డ్ అకౌంటెంట్లుగా ఈ ముఠాకు సహకరించారు. 110కి పైగా గుల్ల కంపెనీలను స్రుష్టించారు. ఒక్కో కంపెనీ నుంచి చైనీయులకు రూ.2-3 లక్షల చొప్పున బదిలీ చేశారు. నిందితుల్లో ఇద్దరు అవిక్ కేడియా రొనాక్ బన్సాల్ చార్టర్డ్ అకౌంటెంట్లుగా ఈ ముఠాకు సహకరించారు. చైనా మోసగాళ్ల పేరిట 110కి పైగా గుల్ల కంపెనీలను స్రుష్టించారు. ఈ కంపెనీల్లో ఒక్కో దాని నుంచి చైనీయులకు రూ.2-3 లక్షల చొప్పున బదిలీ చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు తనను చైనీయులు టెలిగ్రామ్ యాప్ ద్వారా సంప్రదించారని రూబిన్ చెప్పాడు. బ్యాంక్ ఖాతాను కల్పించాలని కోరారని చెప్పాడు. రూబిన్ 29 బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నాడు.ఈజీ రిటర్న్స్ పేరిట ఆకర్షణీయ లాభాలు ఆఫర్ చేస్తారు యాప్ నిర్వాహకులు. ఈ ఆఫర్లను చూసిన అమాయకులు మోసపోతున్నారని పోలీసులు తెలిపారు.