ట్రెక్కింగ్ కి వెళ్లి ప్రమాదం లో 11 మంది మృతి .. కొనసాగుతున్న రెస్క్యూ

Sat Oct 23 2021 12:00:01 GMT+0530 (IST)

11 people were killed while trekking

హిమాలయ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన పర్వతారోహకులు మరణించారు. ట్రెక్కర్లు ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో తప్పిపోయారు. వారిలో 11 మంది పర్వతారోహకులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కనిపించకుండాపోయిన మరో ఆరుగురి కోసం లాంఖగా పాస్ పై భారత వైమానికి దళం గాలిస్తోందని పేరర్కొన్నారు. పర్వతారోహకులు గైడ్ లతో కూడిన 17 మంది బృందం ఈనెల 14న హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా నుంచి ఉత్తరాఖండ్ లోని ఉత్కర్షికి బయల్దేరారు.ఈ క్రమంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ హిమపాతం వాతావరణం అనుకూలించకపోవడంతో వారు 18న ఉత్తరాఖండ్ లోని లాంఖగా పాస్ వద్ద తప్పిపోయారు. దీనితో వారికోసం పోలీసులు అటవీ శాఖ సిబ్బంది భారత వాయుసేన గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో సముద్ర మట్టం నుంచి 17 వేల మీటర్ల ఎత్తులో ఉన్న లాంఖగా పాస్ పై వారంతా చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వాయుసేన అధికారులు అత్యాధునిక తేలికపాటి హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు.

ఈ క్రమంలో నిన్నటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు. దీంతో పాటు హర్సిల్ లో తప్పిపోయిన 11 మంది ట్రెక్కర్‌ల బృందంలో ఏడుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో ఇద్దరిని సురక్షితంగా రక్షించామని మరో ఇద్దరు తప్పిపోయినట్లు వెల్లడించారు. లంఖాగా పాస్ సమీపంలో అదృశ్యమైన 11 మంది ట్రెక్కర్లల్లో ఐదుగురు ట్రెక్కర్ల మృతదేహాలను కిందకు తెచ్చినట్లు తెలిపారు. లామ్ ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. ఇంకా ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది.