Begin typing your search above and press return to search.

దాయాది దేశంలో దారుణ పరిస్థితులు.. గోధుమపిండి కోసం 11 మంది చనిపోయారుల

By:  Tupaki Desk   |   30 March 2023 10:35 AM GMT
దాయాది దేశంలో దారుణ పరిస్థితులు.. గోధుమపిండి కోసం 11 మంది చనిపోయారుల
X
తీవ్రమైన మాంద్యం.. పాలకుల తీరు వెరసి పాకిస్థాన్ లోని ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరం గా మారిన సంగతి తెలిసిందే. అవసరం లేని ఆవేశాల కు పోయి.. భారత్ ను నాశనం చేయటమే లక్ష్యం గా పెట్టుకున్న దాయాది దేశ పాలకుల తీరు ఇప్పుడా దేశంలో దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

గోధుమ పిండి కోసం బారులు తీరటం.. ప్రభుత్వం అందించే దాని కోసం కోట్లాట కు దిగటం.. ఆ సందర్భం గా చోటు చేసుకున్న తొక్కిసలాటలో తాజాగా పదకొండు మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నవైనం షాకింగ్ గా మారింది.

పాక్ ప్రజల నిత్యావరసర వస్తువైన గోధమపిండి కోసం ఇంత భారీ గా తొక్కిసలాట చోటు చేసుకోవటం చూస్తే.. వారెంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతోంది.పాక్ లోని పంజాబ్ ప్రావిన్సు జిల్లాల్లో గోధుమపిండిని ఉచితం గా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భం గా పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. తీవ్రమైన నగదుకొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల పరిస్థితి నేపథ్యంలో ఉచితం గా గోధుమ పిండిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

అయితే.. ఈ కేంద్రాల కు పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు సందర్భాల్లోతొక్కిసలాట చోటు చేసుకోవటంతో పాటు.. పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా ఉదంతం చోటు చేసుకుంది. పాక్ లోని సౌత్ పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి తొక్కిసలాటలు ఇటీవల కాలంలో చోటు చేసుకొని పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి పాక్ లో నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.