Begin typing your search above and press return to search.

11మంది బాలికలను అతడే చంపాడు

By:  Tupaki Desk   |   4 May 2019 12:20 PM IST
11మంది బాలికలను అతడే చంపాడు
X
ముజాఫర్ పూర్ లోని బాలికల వసతిగృహంలో 11మంది బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా మానిటరింగ్ చేస్తోంది. తాజాగా ఈ కేసులో సీబీఐ భారీ ట్విస్ట్ ఇచ్చింది. కనిపించకుండా పోయిన 11మంది బాలికలు హత్యకు గురై ఉంటారని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆ 11మంది బాలికలను ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ చేసి ఉంటాడన్న అనుమానం వ్యక్తం చేసింది సీబీఐ. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో ఎముకలు బయటపడ్డాయి.

ముజఫర్ పూర్ హత్యపై విచారణ సందర్భంగా 11 మంది బాలికల పేర్లను సీబీఐ కనుగొన్నది. వీరిని నిందితుడు ఠాకూర్ ఓ బృందంతో కలిసి హత్య చేసి ఉంటాడని సీబీఐ అనుమానించింది. నిందితులు ఇచ్చిన సమాచారం పాతిపెట్టిన స్థలాన్ని తవ్వగా ఎముకలు లభించినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

ముజఫర్ పూర్ లో ఓ ఎన్జీవో సంస్థ నడుపుతున్న షెల్టర్ హోమ్ లో చాలామంది బాలికలపై అత్యాచారాలు జరిగినట్లు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఓ నివేదికను బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. దీనిపై విచారణను ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది.విచారించిన సీబీఐ ఇందులో నిర్వాహకుడు ఠాకూర్ పేరును చేర్చింది. నిందితుల్లో ఒకడైన గుడ్డుపటేల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా స్మశాన వాటికలో ఓ చోట తవ్వగా బాలికల ఎముకలు బయటపడ్డాయి. దీంతో దీనిపై సుప్రీం కోర్టు చోక్యం చేసుకుంది. చీఫ్ జస్టిస్ గొగోయ్ , జస్టిక్ దీపక్ గుప్తాలు విచారణకు ఆదేశించారు.

అయితే సీబీఐ విచారణ జాప్యం జరగడం.. ఇన్ని రోజులైన బలమైన సాక్ష్యాలు సేకరించకపోవడంతో ఓ పిటీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం దీనిపై సీబీఐకి నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది.

ముజఫర్ పూర్ లో విచారించగా మొత్తం 35మంది బాలికలు ఒకే పేరుతో ఉన్నారని సీబీఐ పేర్కొంది. బాలికల సూచన మేరకు అన్ని స్మశాన వాటికల్లో తవ్వి చూశామని సీబీఐ తెలిపింది. ఠాకూర్ కు చెందిన బయటి స్నేహితులు కూడా బాలికలపై అత్యాచారం చేశారన్న కోణంలో కూడా విచారణ చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అసలైన నిందితులను కాపాడుతున్నామన్న వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు.