Begin typing your search above and press return to search.
నకిలీ ఇన్సూరెన్స్ కేసులో 11 మంది అరెస్ట్
By: Tupaki Desk | 5 Jan 2021 7:31 PM ISTహైదరాబాద్ లో నకిలీ ఇన్సూరెన్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాను అరెస్ట్ చేసిన తరువాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విషయంపై ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీలను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీరి వద్ద నుంచి వెయ్యికి పైగా పాలసీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
పలు కంపెనీలకు సంబంధించిన నకిలీ లేబుల్స్, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. వీరు పెద్ద ఎత్తున నకిలీ ఇన్సూరెన్స్ లు వాహనదారులకు కట్టబెట్టినట్టు సమాచారం.
ఈ నకిలీ ఇన్సూరెన్స్ ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు రమేశ్ ను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రమేశ్ పొల్యుషన్ వెహికల్ ను నిర్వహిస్తున్నారని.. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.