శృతి మించిన సరదా.. 11 మంది మృతి

Thu Aug 16 2018 13:33:15 GMT+0530 (India Standard Time)

11 Dead in Shivpuri Flash Flood, 45 Saved as Rescue Ops Continue

సరదా తప్పేం కాదు. కానీ.. అప్రమత్తత చాలా అవసరం. స్నేహితులతో సరదాగా వెళ్లే వేళ.. చాలామంది ఎంజాయ్ మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ.. దాని వల్ల వచ్చి పడే అనర్థాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో మాత్రం అస్సలు ఆలోచించరు. అదే కన్నవారికి మొదలుకొని.. వారితో అనుబంధం ఉన్న వారంతా శోకానికి గురయ్యేలా చేస్తుంది. సెలవు రోజున సరదాగా గడుపుదామని ప్లాన్ చేసుకున్న వారికి అంతులేని శోకమే మిగిలింది.పంద్రాగస్టు సందర్భంగా వచ్చిన సెలవు రోజున ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో 45 మంది సభ్యులతో ఉన్న బృందం ఒకటి మధ్యప్రదేశ్ లోని శివపురి-గ్వాలియర్ సరిహద్దుల్లోని సుల్తాన్  ఘడ్ వద్ద వాటర్ ఫాల్స్ సమీపానికి పిక్నిక్ కు వచ్చింది. వీరంతా వాటర్ఫాల్స్ వద్దనున్న కొండ అంచుకు దగ్గరగా వెళ్లారు.

నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో సరదాగా సాగుతున్న వారి పిక్నిక్ లో అనుకోని రీతిలో వరదనీరు పోటెత్తి.. వారి ప్రాణాల మీదకు తెచ్చింది.అప్పటివరకూ నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉన్న క్రమం నుంచి క్షణాల్లో భారీగా పెరిగిన నీటి ప్రవాహాన్ని గుర్తించి.. తేరుకునే లోపే.. భారీగా వరద ఆ బృందాన్ని చుట్టుముట్టింది.

దీంతో భయాందోళనలకు గురైన వారు.. తేరుకొనే లోపే భారీ నష్టం వాటిల్లింది. 45 మంది బృందంలోని 11 మంది నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. మిగిలిన వారు రాక్ పైభాగాన చిక్కుకుపోయారు.ప్రవాహ ఉధృతి నుంచి తమను తాము కాపాడుకుంటూ 9 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ సర్కార్ హుటాహుటిన రెస్య్కూసిబ్బందిని రంగంలోకి దింపింది. హెలికాఫ్టర్ సాయంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాగలిగారు. వరదలో కొట్టుకుపోయిన వారి కోసం పెద్ద ఎత్తున గాలింపులు జరుపుతున్న ఎవరూ దొరకలేదు. ఈ ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది.


వీడియో కోసం క్లిక్ చేయండి