Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఏపీలో మరోసారి వాయిదా పడ్డ 10th క్లాస్ ఎగ్జామ్స్ !

By:  Tupaki Desk   |   24 March 2020 3:41 PM IST
బ్రేకింగ్ : ఏపీలో మరోసారి వాయిదా పడ్డ 10th క్లాస్ ఎగ్జామ్స్ !
X
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. నిన్నటి వరకు అనుకున్న సమయానికి పదో తరగతి పరీక్షలు ప్రారంభిస్తామని చెప్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ..రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటం , అలాగే రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

వాటిని రాబోయే రెండు వారాలపాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు వారాల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే... మరిన్ని రోజులు వాయిదా వేసే అవకాశం ఉందని తెలిసింది. పరీక్షలు ఎప్పుడు జరిపేదీ త్వరలో తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మొదటిసారి వాయిదా వేశారు.. కరోనా దెబ్బకు రెండోసారి వాయిదాపడ్డాయి. ఇకపోతే ఇప్పటికే తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అయినా కేసుల సంఖ్య 7కి చేరుకుంది. దీన్ని బలంగా అడ్డుకోకపోతే మరింత ప్రమాదం పొణ్ణచి ఉందని భావించి ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఎగ్జామ్స్ కూడా వాయిదా వేస్తే మంచిదని భావించింది. అలాగే పదో తరగతి పరీక్షలతో పాటుగా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఎంసెట్‌ - ఈసెట్‌ - ఐసెట్‌ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడవును పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మార్చి 29 వరకు ఉన్న ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5కు పొడిగించారు. అలాగే ఏప్రిల్‌ 2వరకు ఉన్న ఈసెట్‌ - ఐసెట్‌ ప్రవేశ పరీక్షల గడువును ఏప్రిల్‌ 9వరకు పొడిగించారు.