Begin typing your search above and press return to search.

105 సంవత్సరాలు .. స్పానిష్ ఫ్లూ .. కరోనా .. రోండు ప్రపంచ యుద్ధాలు .. జిన్ విత్ ద్రాక్ష !

By:  Tupaki Desk   |   2 March 2021 5:00 PM IST
105 సంవత్సరాలు .. స్పానిష్ ఫ్లూ .. కరోనా .. రోండు ప్రపంచ యుద్ధాలు .. జిన్ విత్ ద్రాక్ష !
X
ప్రపంచం లో ఎంతో మందిని కరోనా వైరస్ ప్రభావితం చేసింది. ముఖ్యంగా వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండి వారికి ప్రమాదకారిగా మార్చింది. మరణించే శాతం కూడా వీరిలోనే ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే. అయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వృద్ధులు కూడా ఎంతో మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజాగా 105 ఏళ్ల లూసియా డిక్లేర్క్ కరోనా నుంచి బయటపడింది. గతంలో స్పానిష్ ఫ్లూ ని కూడా ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు కరోనాను కూడా జయించడం విశేషం. ఆమె రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడమే దీనికి కారణం.

ఆమె ఇంత ఆరోగ్యంగా ఉండేందుకు కారణం ఆమె జంక్ ఫుడ్ అస్సలు తీసుకోదట. అంతేకాకుండా కరోనా నుంచి బయటపడేందుకు మరోక ముఖ్యమైన వస్తువుతో కూడా సంబంధం ఉందని తెలిపింది. ప్రతి రోజు ఉదయాన్ని నానబెట్టిన 9 ఎండు ద్రాక్షలను ఆహారంగా తీసుకోవడం వల్లే తను ఆరోగ్యంగా ఉన్నానని ఈ బామ్మ స్పష్టం చేసింది.

కరోనా బారినప్పుడు 9 రోజుల పాటు రోజు మార్చి రోజు వీటిని తీసుకున్నట్లు ఈ బామ్మ తెలిపింది. తన ఆరోగ్య చిట్కాలను పిల్లలు, మనవలు, మనవరాళ్లు కూడా ఫాలో అవుతున్నారని చెబుతోంది. అంతేకాకుండా కలబందరసాన్ని నేరుగా తాగడం, బేకింగ్ సోడాతో పళ్లు తోముకోవడం లాంటి ఈమె దైనందిన అలవాట్లు. 99 ఏళ్ల వరకు కూడా దంతాల్లో క్యావిటీ సమస్య లేదని, అప్పటివరకు ఆమె పనిచేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లూసియాది చాలా పెద్ద కుటుంబం. ఆమెకు ఇద్దరు కుమారులు, ఐదుగురు మనవళ్లు, 12 మంది మునిమనవళ్లు, మరో 11 మంది ముని ముని మనవళ్లు ఉన్నారు. గతేడాది 104వ జన్మదినోత్సవాన్ని లూసియా జరపుకుందని, ఆ సమయంలోనే కరోనా కలకలం అందరిని ఆందోళన కలిగించిందని ఆమె కుమారుడు 78 ఏళ్ల ఫిలిప్ లాస్ తెలిపారు. అయితే కరోనా వచ్చినా కానీ దాన్నుంచి ఆమె కోలుకోవడం నమ్మలేకపోతున్నామని ఆయన అన్నారు.మిస్టిక్ మిడోస్ లో నివసిస్తున్న లూసియా డిక్లేర్క్ చుట్టుపక్కల వారిలో 62 మంది కరోనా కారణంగా మరణించారు