Begin typing your search above and press return to search.
105 ఏళ్ల భామ ప్రపంచ రికార్డు.. సంకల్పం ముందు చిన్నబోయిన వయసు
By: Tupaki Desk | 15 Nov 2021 11:11 AM IST60 ఏళ్ల వయసు వస్తే కృష్ణా.. రామా.. అంటూ ఇంట్లో కూర్చొని పూజలు చేసుకునే వాళ్లని ఈ కాలంలో చూస్తున్నాం. ఇంకో అడుగు ముందుకు వేస్తే.. 60 ఏళ్ల వరకు బతికేదెవురు అనే వాదన కూడా చాలామంది దగ్గర మనకు వినిపిస్తుంది. ఇది ఈనాటి వృద్ధుల పరిస్థితి. మన చుట్టూ ఉండే వారిలో చాలా మంది ఇలానే ఉంటారు. వయసు పైబడిన తరువాత ఇంట్లో నుంచి బయటకు వచ్చే దానికి కూడా సంకోచిస్తారు. సమయాన్ని బట్టి వీధుల్లోకి రావాలన్నా ఆలోచించే పరిస్థితి వారిది. పోనీ కుటుంబ సభ్యులు వాకింగ్ చేయమని వారికి చెప్పినా.. ఈ వయసులో నాకెందుకు అని చెబుతుంటారు.
మనవడిని కానీ మనవరాలుని కానీ పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ కాలం వెళ్లదీస్తామని అంటారు. కానీ లూసియానా కు చెందిన ఓ వృద్ధురాలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. వయసు వందకు దాటినా... రన్నింగ్ లో మాత్రం ఇరగదీస్తుంది. ఈ భామ మెరుపు వేగానికి రికార్డులు కూడా దాసోహం అంటున్నాయి. ఇటీవలే ఈమె ప్రపంచ రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈమె స్పీడుని చూసి కుర్రవాళ్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనేది మనం కూడా తెలుసుకుందాం.
ఆమె వయస్సు 105. ఆమె అందుకున్న రికార్డులు బోలెడు. ఆమె వేగం మెరుపు సమానం. 100 మీటర్ల పరుగును అలవోకగా... తన వయసు కంటే తక్కువ సెకన్లతో పూర్తి చేసింది. ఆమె పేరే జూలియా హరికేన్ హాకిన్స్. ఇటీవల నిర్వహించిన ఓ పరుగు పందెంలో పాల్గొన్నారు జూలియా. 100 మీటర్ల దూరాన్ని సునాయాసంగా కేవలం 102 సెకన్లలోనే పూర్తి చేశారు. ఆమె పేరు లో ఉన్నటువంటి హరికేన్ అనే పదం ఆమె సృష్టించిన రికార్డుల ద్వారానే వచ్చిందని తెలిసిన వాళ్లు చెబుతున్నారు.
పరుగు పందెం పూర్తి అయ్యాక.. మీరు అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు కదా.. అని అడిగితే... తాను మాత్రం దానికి సంతృప్తిగా లేనని చెబుతోంది. కేవలం ఒక నిమిషం లోనే పూర్తి చేయాలని అనుకున్నట్లు చెప్పింది. ఇది సాధ్యమా ... అంటే ఖచ్చితంగా సాధ్యమే అని సమాధానం ఇస్తుంది. ఈమె పేరిట ఇప్పటికే చాలా ప్రపంచ రికార్డు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వయసులో 100 మీటర్ల దూరాన్ని 102 సెకన్లలో పూర్తి చేయడం అనేది అసంభవమని పేర్కొన్నారు. అయితే జూలియా మాత్రం దీనిని చాలా త్వరగా పూర్తి చేసినట్లు చెప్పారు. అందుకే ఈ ప్రపంచ రికార్డు తన సొంత అయినట్లు తెలిపారు.
ఈ రికార్డులన్నీ తనకి ఒక్కరోజులో వచ్చినవి కాదని అంటోంది జూలియా. అందరిలాగే ఇంట్లో కూర్చొని పూజలు చేయడం వల్ల ఇలాంటివి సాధ్యపడవని చెబుతున్నారు. సంకల్పం అనేది గట్టిగా ఉండాలి కానీ వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని పేర్కొన్నారు. తాను మొదటగా 80 ఏళ్ల వయసులోనే అథ్లెటిక్స్ లో పాల్గొన్నట్లు చెప్పారు. తనకు సైక్లింగ్ అంటే ఇష్టమని చెబుతోంది ఈ భామ.
ఇందుకుగానూ 25 ఏళ్ల క్రితం జరిగిన పోటీల్లో పాల్గొని సైక్లింగ్లో మొదటి స్థానం సంపాదించినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే 2017 లో ఆమె అనూహ్యంగా సైక్లింగ్ పక్కన పెట్టి రన్నింగ్ ట్రాక్ ను ఎంచుకుంది. అప్పటి నుంచి తన పరుగుల ప్రవాహం మొదలైందని చెప్పుకొచ్చింది. ఈ వయసులో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన విధంగా ప్రయత్నిస్తే ప్రతిదీ సాధ్యమేనని అంటోంది జూలియా. అయితే మరిన్ని రికార్డులను జూలియా అందుకోవాలని మనం ఆకాంక్షిద్దాం.