ఒకటి కాదు రెండు కడుపులో 104 డ్రగ్స్ క్యాప్సిల్స్.. పగిలితే ప్రాణాలు పోవడమే?

Sun Sep 25 2022 19:06:20 GMT+0530 (India Standard Time)

104 drug capsules hidden in the stomach

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా క్రిమినల్స్ కొత్త మార్గాలతో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. వారి ఐడియాలు పోలీసులను షాక్ కు గురిచేస్తున్నాయి.రోజుకో పద్ధతిలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.ఇటీవల పెళ్లి పత్రికల్లోనూ డ్రగ్స్ ను సరఫరా చేస్తూ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కారు. కోట్ల విలువైన డ్రగ్ ను ఈజీగా లక్ష్యం చేరుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులోనూ ఏకంగా ఓ డ్రగ్స్ ను వ్యక్తి కడుపులో పెట్టుకొని తండ్లాడాడు. ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ లు అతడు వేసుకున్న దుస్తులు షూలు మొత్తం పరిశీలించినా కస్టమ్స్ అధికారులకు ఒక్క గ్రామ్ కూడా డ్రగ్స్ చిక్కలేదు. డౌట్ వచ్చి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎంతో శ్రమించిన డాక్టర్లు అతడి కడుపులో ఉన్న 13 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ క్యాప్సిల్ ను బయటకు తీశారు. ఇదే ఇప్పుడు కలకం రేపుతోంది.

ఆఫ్రికాలోని ఘనా దేశంలో నివాసం ఉంటున్న బాహా అంపాడు క్వాడ్వో(53) అనే పెద్దాయన  తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో దిగాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. బ్యాగులు షూలు మొత్తం చెక్ చేసినా డ్రగ్స్ దొరకలేదు. కానీ వాలకం చూసి ఆస్పత్రికి తీసుకెళితే అసలు విషయం వెలుగుచూసింది.

స్కానింగ్ తీసిన వైద్యులకు కడుపులో 104 క్యాప్సిల్స్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. మూడు రోజుల పాటు శ్రమించిన వైద్యులు అతడి కడుపులో ఉన్న 104 క్యాప్సిల్స్ ను బయటకు తీశారు. ఒక్క క్యాప్సిల్ పగిలినా అతడి ప్రాణం పోయి ఉండేదని వైద్యులు అంటున్నారు. ప్రాణాలకు తెగించి మరీ డబ్బు కోసం ఇతగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు.

బహా కడుపులో ఉన్న 1.2 కేజీల డ్రగ్స్ విలువ ఏకంగా రూ.13.60 కోట్ల విలువ ఉంటుందని .. అతడు ప్రాణాలకు తెగించి కడుపులో డ్రగ్స్ పట్టుకొని బెంగళూరు వచ్చాడని.. బెంగళూరులో ఎవరికీ ఇవ్వడానికి ప్రయత్నించాడనే విషక్ష్ంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.

ఇటీవల పెళ్లి కార్డుల్లో డ్రగ్స్ పెట్టి రవాణా చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. ఇలా చేసినా కూడా పోలీసులు పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక ఖరీదైన పెళ్లి కార్డులో ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వీరి వ్యూహాన్ని పసిగట్టి పట్టుకున్నారు. వెడ్డింగ్ కార్డులో ఉన్న డ్రగ్స్ ను బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఇప్పుడు ఇదే బెంగళూరుకు విదేశాల నుంచి ఓ ఆఫ్రికన్ వ్యక్తి కడుపులో డ్రగ్స్ పెట్టుకొని రావడం విశేషం.