Begin typing your search above and press return to search.
లాకర్ లో దాచిన400 కిలోల బంగారంలో 103 కేజీలు మాయం
By: Tupaki Desk | 13 Dec 2020 9:28 AM ISTసీబీఐ ఇమేజ్ మొత్తం బర్ బాద్ అయ్యే ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఒక సంస్థపై జరిపిన సోదాల్లో భాగంగా 400 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. తాజాగా లెక్కలు చూసే క్రమంలో ఇందులోని 103 కిలోలు మాయమైన ఉదంతం పెను సంచలనంగా మారింది. దీంతో.. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు తాజాగా ఆదేశించింది.
ఎనిమిదేళ్ల క్రితం (2012) చెన్నైలోని సురాన కార్పొరేషన్ లిమిటెడ్ లో సీబీఐ సోదాలు నిర్వహించింది. బిస్కెట్లు.. ఆభరణాల రూపంలో ఉన్న 400.47 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని సురాన సంస్థ లాకర్లలో ఉంచి సీల్ వేశారు. ఆ తాళం చెవుల్ని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. వివిధ బ్యాంకులకు సురాన సంస్థ అప్పులు ఉండటంతో.. సీజ్ చేసిన బంగారాన్ని అప్పు ఉన్న బ్యాంకులకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో.. సీబీఐ అధికారులు సీజ్ చేసిన బంగారం లాకర్లను తాజాగా తెరిచారు. అందులో 103 కేజీల బంగారం తక్కువగా ఉందంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. దీనిపై విచారణ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి. సీజ్ చేసిన బంగారం 296.606 కేజీలని పొరపాటున 400 కేజీలుగా తప్పుగా నమోదు చేసి ఉంటారని పేర్కొనటం గమనార్హం.
గ్రాముల్లో స్వల్పంగా తేడా వస్తే అర్థం చేసుకోవచ్చని.. ఏకంగా 100 కేజీలు తేడా ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాలం గడిచే కొద్దీ గంజాయి కరిగిపోతుంది కానీ.. బంగారం కరిగిపోదుకదా? అంటూ కోర్టు ప్రశ్నలు సంధించింది. భారీగా మాయమైన బంగారం కేసు విచారణ చేపట్టాలని కోర్టు సీబీసీఐడీని కోరింది. దీనికి సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. స్థానిక పోలీసుల చేత ఈ కేసు దర్యాప్తు చేస్తే.. తమ ప్రతిష్ట దెబ్బ తింటుందని పేర్కొనగా.. హైకోర్టు అందుకు అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. సీబీఐ సైతం బంగారం మాయం కావటంపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీచేసింది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అయినా.. సీజ్ చేసిన బంగారంలో వంద కేజీలు మాయం కావటం ఏమిటి చెప్మా?