Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే కి 1000 కోట్లు ఇచ్చి సీఎం యడ్డ్యూరప్ప .. ఎందుకోసమంటే ?

By:  Tupaki Desk   |   6 Nov 2019 6:35 AM GMT
ఆ ఎమ్మెల్యే కి 1000 కోట్లు ఇచ్చి సీఎం యడ్డ్యూరప్ప .. ఎందుకోసమంటే ?
X
దేశ భాష లందు తెలుగు లెస్స అన్నట్టు ..దేశ రాజకీయాల యందు కర్ణాటక రాజకీయాలు వేరయా అని చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ ఎన్ని రోజులు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో .. ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఎవరు ఉంటారో ప్రజలకే కాదు ..రాజకీయ పార్టీ నేతలకి సైతం అర్థం కాదు. అందుకే దేశ రాజకీయాలలో కర్ణాటక రాజకీయాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక ప్రస్తుత సీఎం యడ్డ్యూరప్ప .. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సరైన మెజారిటీ లేకపోయినా .. మెజారిటీ ఉంది అని సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు. కానీ , ఆ తరువాత అసెంబ్లీ లో తన బలం నిరూపించుకోలేక పోవడంతో సీఎం గా ప్రమాణస్వీకారం చేసి వారం తిరగకముందే రాజీనామా చేసారు.

ఆ సమయంలో కాంగ్రెస్ , జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆలా ఉన్న సమయంలో ఒక్కసారిగా కొంతమంది స్వసంత్రులు , జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి క్యాంప్ రాజకీయాలకి దారి తీసి ..మళ్ళీ బీజేపీ అధికారం చేపట్టేలా చేసారు. దీనితో మరోసారి మూడు నెలల క్రితం యడ్డ్యూరప్ప కర్ణాటక సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు. కానీ ,సీఎం యడ్డ్యూరప్ప పై ఇప్పుడు అనేక రకమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అప్పట్లో క్యాంప్ రాజకీయాలకి తెరతీసింది యడ్డ్యూరప్పే అని ఆడియో టేప్ లు బయటకి వచ్చాయి.

తాజాగా అనర్హత జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ యడ్డ్యూరప్ప పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన మద్దతుదారులను ఉద్దేశించి నారాయణ గౌడ మాట్లాడుతూ...కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే కొన్ని రోజుల ముందు ఓ వ్యక్తి నన్ను యడియూరప్ప ఇంటికి ఉదయం 5గంటల సమయంలో తీసుకెళ్లాడు. మేము ఆయన ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో యడియూరప్ప పూజగదిలో ఉన్నారు.

ఆ తర్వాత ఆయన మా దగ్గరకి వచ్చి కూర్చోమన్నారు. నేను మరోసారి సీఎం అయ్యేందుకు నువ్వు మద్దతు ఇవ్వాలి అని యడియూరప్ప అడిగారు. క్రిష్ణరాజపేట నియోజకవర్గ అభివృద్ధికి 700కోట్లు కేటాయించాలని అడిగాను. ఆ తర్వాత ఆయన వెయ్యి కోట్లు ఇచ్చాడు. నా నియోజకవర్గానికి ఇంత సహకారం అందించిన వ్యక్తికి సపోర్ట్ చేయాలనిపించింది. మద్దతు ప్రకటించాను అని చెప్పారు. అయితే ఆ తర్వాత అనర్హత ఎమ్మెల్యేలతో మాకు ఎలాంటి సంబంధం లేదని యడియరప్ప అన్నారని నారాయణ గౌడ తెలిపారు.