Begin typing your search above and press return to search.

కల్వకుంట్ల కవితపై పోటీకి 1000 మంది

By:  Tupaki Desk   |   18 March 2019 12:10 PM IST
కల్వకుంట్ల కవితపై పోటీకి 1000 మంది
X
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణలో తిరుగులేకుండా ఉన్న కేసీఆర్ కు ఒకింత ఆందోళనకు గురిచేసే వార్త ఇదీ.. ఆయన కుమార్తె - నిజామాబాద్ ఎంపీ కవితకు ఈసారి ఎన్నికల్లో అంత ఈజీగా పరిస్థితులు లేవు. ఆమె గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు కానీ.. ఆమెకు షాకిచ్చేలా నిజామాబాద్ రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పసుపు - ఎర్రజొన్న మద్దతు ధర కోసం కొంత కాలంగా నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా కవిత పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్న రైతులు.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు షాక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆమెపై 1000 మందిపోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఇలా కవితకు తమ నిరసన తెలుపుతున్నట్టు రైతులు చెబుతున్నారు.

తెలంగాణలోనే బలమైన కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ సీటులో పోటీచేయలేక ఆమె ప్రత్యర్థి - కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ కూడా భువనగిరి నుంచి పోటీచేయడానికి పలాయనమయ్యారు. అది దక్కకపోతే వేరే సీటు నుంచి పోటీచేయాడానికి సిద్ధమయ్యారు. అపోజిషనే లేదు అనుకుంటున్న సమయంలో కవితకు రైతులు షాకిస్తున్నారు.

దాదాపు 500 నుంచి 1000 మంది రైతులు కవితపై పోటీకి రెడీ అవుతున్నారట.. ఇదే జరిగితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ వాడాల్సి ఉంటుంది. దాని ఫలితం, ఎన్నిక వాయిదా పడే అవకాశాలుంటాయి. ఇలా సార్వత్రిక ఎన్నికల వేళ కవిత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు..