Begin typing your search above and press return to search.

బాబా రాందేవ్ పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా !

By:  Tupaki Desk   |   26 May 2021 11:54 AM GMT
బాబా రాందేవ్ పై  రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా !
X
అల్లోప‌తి వైద్యం కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ) ఉత్త‌రాఖండ్ శాఖ రూ. 1000 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేసింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా రాందేవ్ క్షమాపణ చెప్పాలని, ఈ నేపథ్యంలోనే 1000 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని నోటిసులు పంపింది. మరోవైపు రాందేవ్‌ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని ఐఎంఏ హెచ్చరించింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్‌ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్‌ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్‌ రావత్‌ కు లేఖ రాసింది. రాందేవ్‌ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కాగా ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు కూడా బాబా రాందేవ్ స్టేట్ మెంట్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు.

బాబా వ్యాఖ్యలపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ లేఖ రాసిన అనంతరం వాటిని ఆయన ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో అల్లోపతి డాక్టర్లు సమాధానం చెప్పాలంటూ.. 25 ప్రశ్నలను కూడ సంధించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. షుగర్, బీపీ లాంటీ వాటికి అల్లోపతిలో వైద్యం ఉందా..గుండెకు నొప్పిలేకుండా ఆపరేషన్ చేయగలరా లాంటీ పలు ప్రశ్నలను ఆయన అల్లోపతి వైద్యులకు సంధించారు..కాగా ఇప్పటికే ఈ వివాదంపై ట్వీట్ ద్వారా చెప్పిన క్షమాపణ సరిపోదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రస్తుతం ఇలాంటీ ప్రశ్నల ద్వార విషయాన్ని మరింత హీట్ ఎక్కించారు బాబా రాందేవ్. కాగా మొదట బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.